టాలీవుడ్ లో మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. అతని సినిమా వస్తుంది అంటే ఆ హీరో ఫాన్స్ ఈ హీరో ఫాన్స్ అనేది లేకుండా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ విధంగా మహేష్ బాబు తన ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకున్నాడు అనేది వాస్తవం. టాలీవుడ్ లో మహేష్ క్రేజ్ ముందు చాలా మంది హీరోలు ఇబ్బంది పడ్డారు అనేది వాస్తవం. ముఖ్యంగా మహేష్ బాబు సినిమాల్లో చూపించే కొన్ని కోణాలు ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. ఇక ఆయన కెరీర్ లో బెస్ట్ దర్శకుల్లో ఒకరుగా చెప్పుకునేది మాత్రం కొరటాల శివ. 

 

కొరటాల శివ తో మహేష్ బాబు చేసిన రెండు సినిమాలు కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. ముందు మహేష్ తో ఆయన చేసిన శ్రీమంతుడు సినిమా మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా నుంచి మహేష్ బాబు సినిమాలకు కమర్షియల్ గుర్తింపు వచ్చింది అనేది వాస్తవం. ఆ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా మహేష్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మహేష్ తో ఆయన చేసిన భరత్ అను నేను సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా కూడా మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 

 

అలాగే వసూళ్లు కూడా భారీగా సాధించింది ఈ సినిమా. మహేష్ బాబు సినిమాల మీద నిర్మాతలు అప్పటి నుంచే ఆసక్తి ఎక్కువగా చూపించడం మొదలుపెట్టారు. మహేష్ తో కమర్షియల్ సినిమా చేయడానికి చాలా మంది దర్శకులు, నిర్మాతలు అక్కడి నుంచి పోటీ పడుతున్నారు.  మహేష్ బాబు కూడా అదే కోణంలో ఎక్కువగా ఆలోచిస్తూ వస్తున్నాడు. తన సినిమాలకు మార్కెట్ పెరగడం తో మహేష్ కూడా పెట్టుబడులు పెడుతున్నాడు తన సినిమాల్లో.

మరింత సమాచారం తెలుసుకోండి: