టాలీవుడ్ లో చాలా మంది దర్శకులు ఉన్నారు. చాలా మంది హీరోలు ఉన్నారు. కానీ వీరిలో కొంతమందికి మాత్రమే ప్రేక్షకులకు ఫేవరెట్ గా  నిలుస్తూ ఉంటారు. ఇలా ప్రేక్షకులకు ఫేవరెట్గా నిలిచిన  కాంబినేషన్ లలో  ఒకటి అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు టాలీవుడ్ లో సెన్సేషన్ విజయాలు సాధించాయి. ఇక త్రివిక్రమ్ యాస ప్రాసతో కూడిన డైలాగులకు... అల్లు అర్జున్ కామెడీ టైమింగ్ సరిగ్గా సరిపోయాయి. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకులు లోకి దూసుకు పోయి ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. అందుకే వీరిద్దరి కాంబినేషన్ లో ఏదైనా సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు అందరూ వేయికళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు. 

 

 

 మొదట 2012 సంవత్సరంలో త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ కుదిరింది. వీరిద్దరి కాంబినేషన్ లో మొదటిసారి జులాయి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర చెప్పే డైలాగులు అద్భుతంగా ప్రేక్షకులను కట్టిపడేశాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ వేసిన అంచనాలు... ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తాయి సినిమాలో.  ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్లో మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సన్నాఫ్ సత్యమూర్తి అనే సినిమా వచ్చింది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా... బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది అని చెప్పాలి. 

 

 

 సాధారణ యువకుడి జీవితం ఎలా ఉంటుంది అనే దానిని ఈ సందర్భంగా త్రివిక్రమ్ సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో చూపించాడు. ఇక ఈ సినిమాలో నాన్న గౌరవాన్ని కాపాడేందుకు అల్లు అర్జున్ పడే కష్టాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక అల్లు అర్జున్  ప్రాసతో కూడిన డైలాగులు ఈ సినిమాలో  ప్రేక్షకులందరికీ బాగా కనెక్ట్ అవుతాయి. ఇక ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత ముచ్చటగా మూడో సారి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా అలా వైకుంఠపురములో. ఈ సినిమా గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. పాటలు, డాన్సులు, కామెడీ, యాక్షన్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో దేనికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అన్ని అద్భుతంగా ప్రేక్షకులను ఆకర్షించాయి. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇలా చాలాసార్లు త్రివిక్రముడు బన్నీ కెరీర్ను మలుపు తిప్పాడు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: