మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు అరడజనుకు పైగా హీరోలు పరిచయమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు. మొదటినుంచి విభిన్నమైన సినిమాల కథలు ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించాడు మెగా హీరో వరుణ్ తేజ్. ఇక మెగా అభిమానులందరికీ మెగా ప్రిన్స్ గా మారిపోయాడు. ఎన్నో విభిన్నమైన కథతో ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను అందుకున్నారు వరుణ్ తేజ్. మెగా హీరోలలో వరుణ్ తేజ్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది.

 

 

 ఇక మెగా ఫ్యామిలీలో ఈ  హీరో సక్సెస్ రేటు కూడా బాగా ఉంటుంది అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా మొదటి నుంచి లవర్ బాయ్ గా కనిపిస్తూ... అందరినీ అలరిస్తూ వచ్చాడు మెగా ప్రిన్స్  వరుణ్ తేజ్ ... మాస్ యాక్షన్ పైన ఎక్కువగా దృష్టి పెట్టలేదు. ప్రతి సినిమాలో లవర్ బాయ్ గా నే కనిపిస్తూ వచ్చాడు. ఇక వరుణ్ తేజ్ హీరోగా నటించిన తొలిప్రేమ సినిమా అయితే వరుణ్ తేజ్ కు మరింత గుర్తింపు తెచ్చి పెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ నటన వరుణ్ తేజ్ స్టైల్ అన్ని  ప్రేక్షకులను తెగ ఆకర్షించాయి. ఈ సినిమా మంచి విజయం సాధించింది. 

 

 

 

 అయితే అప్పటి వరకు లవర్ బాయ్ గా కనిపించినా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గద్దల కొండ గణేష్ సినిమాలో మాత్రం ప్రేక్షకులు అందరిని ఆశ్చర్యపరిచాడు అనే చెప్పాలి. పెద్ద గడ్డం తో.. భయంకరమైన గెటప్ తో ... గ్యాంగ్ లీడర్ లాగా అదరగొట్టాడు. ఇక ఈ సినిమాలో లవర్ బాయ్ వరుణ్ తేజ్ కాస్త మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గర అయిపోయాడు. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ నట విశ్వరూపం చూపించాడు అనే చెప్పాలి. గద్దల కొండ గణేష్ సినిమాలో గ్యాంగ్ స్టార్ పాత్రలో నటించిన వరుణ్ తేజ్... ఎవ్వరూ ఊహించని విధంగా పాత్రలో జీవించి మరి నటిస్తూ ఆశ్చర్యపరిచాడు. ఇక వరుణ్ తేజ్ కెరీర్లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ సాధించింది. ఇలా మెగా హీరోల్లో ఎవరికీ తెలియని కోణాన్ని దర్శకుడు బయటకు తీశాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: