మాటల త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా వస్తుంది అనగానే ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎన్ని సినిమాలు టాలీవుడ్ లో వస్తున్నా సరే త్రివిక్రమ్ సినిమా అనగానే ఒక ప్రత్యేకమైన ఆసక్తి ప్రేక్షకులకు ఉంటుంది. ఆ విధంగా అతను తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయడానికి ఎందరో హీరోలు పోటీ పడుతూ ఉంటారు. మహేష్ బాబు లాంటి హీరో కూడా అతనితో సినిమా చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి అయితే, 

 

వాళ్ళ లైఫ్ ని ఒక్కసారిగా మార్చేశాడు. ఒకరికి మూడు హిట్స్ ఒకరికి రెండు హిట్స్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ కెరీర్ ని గాడిలో పెట్టాడు త్రివిక్రమ్. ఆ విధంగా తనకంటూ టాలీవుడ్ లో ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో డిమాండ్ ఉన్న దర్శకుల్లో అతను ఒకడు. హీరోని ఏ విధంగా చూపించాలి, హీరో నోటి నుంచి ఏ మాటలు రావాలి అనేది అతనికి తెలిసిన విధంగా ఈ తరంలో ఏ దర్శకుడికి తెలియదు. యూత్ కి ఏ మాటలు నచ్చుతాయో ఆ విధంగా అతను సినిమాలు చేస్తున్నాడు. 

 

ప్రస్తుతం అతని సినిమాలకు క్రేజ్ ఎక్కువ. కమర్షియల్ దర్శకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన సినిమాల్లో హీరో పక్కన నటించే హీరోయిన్ కి, ఇతర నటులకు కూడా మంచి గుర్తింపు వస్తుంది అనేది వాస్తవం. ఆ విధంగా సినిమా ఉండే విధంగా జాగ్రత్తలు పడుతూ ఉంటాడు త్రివిక్రమ్. ప్రస్తుతం అతని కెరీర్ లో పీక్ స్టేజి లో ఉన్నాడు. ఎన్టీఆర్ లాంటి హీరో మరో మాట ఆలోచించకుండా త్రివిక్ర౦ తో సినిమా చేయడానికి ముందుకి వచ్చాడు అంటే త్రివిక్రమ్ స్థాయి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఒకటే గుర్తు అతని సినిమాల్లో చేస్తే హీరోకి అంటూ ప్రత్యేక ఇమేజ్ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: