ఒకప్పుడు భారతీయ చలన చిత్ర రంగంలో ఓ ట్రెండ్ సృష్టించింది ‘షోలో’ చిత్రం. అమితాబచ్చన్, ధర్మెంద్ర నటించిన ‘షోలే’ సంవత్సరాల పాటు థియేటర్లో ఆడుతూ వచ్చాయి. ఎన్నో రికార్డులు కొల్లగొట్టాయి.  ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ పై రక రకాల కామెంట్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే.  ఎంతో మంది దీనిపై తమదైన సెటైర్లు విసురుతున్నారు.  తాజాగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సైతం కరోనాపై తనదైన స్టైల్లో సెటైర్లు వేస్తూ వస్తున్న విషయం తెలిసిందే.  ఈ మద్య కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచ వ్యాప్తంగా షాపింగ్ మాల్స్, థియేటర్లు, విద్యాసంస్థలు, క్లబ్, రెస్టారెంట్స్ అన్నీ మూసి వేసిన విషయం తెలిసిందే. దాంతో ఎక్క‌డ చూసిన ఖాళీ రోడ్లు.. మ‌నుషులు క‌నిపించ‌ని రెస్టారెంట్‌లు.. షాపింగ్ మాల్సే క‌నిపిస్తున్నాయి.

 

ఇలాంటి వీడియోల‌తో ప్ర‌ముఖ అమెరిక‌న్ మీడియా డైలీ మెయిల్ ఏకంగా ఓ వీడియోనే చేసి సోష‌ల్ మీడియాలో వ‌దిలేసింది. అదిప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో వైర‌ల్‌గా మారింది. ఇప్పుడు భారత దేశంలో కూడా ఎక్కడ చూసినా ఖాళీ రోడ్లే దర్శనమిస్తున్నాయి.  షూటింగ్స్ వాయిదాలు వేసుకున్నారు.. థియేటర్లు 31 వరకు బంద్.. ఒక రకంగా చెప్పాలంటే సీరియస్ కర్ఫ్యూ విధించినట్లు అనిపిస్తుంది.  అయితే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సెలబ్రెటీలు రక రకాల చిట్కాలు చెబుతున్న విషయం తెలిసిందే.  ముఖ్యంగా ఎవరికి షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు.. నమస్తే పెట్టాలి.

 

బయటకు వెళ్లి వచ్చిన తర్వాత సబ్బుతో చేతులు శుభ్ర చేసుకోవాలి.. షానిటైజర్ ని వాడాలి.. ముఖానికి చేతులు తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ చెబుతున్నారు. తాజాగా రాంగోపాల్ వర్మ `షోలే` సినిమా టైటిల్‌కు ఆపాదించాడు. ఇండియ‌న్ తెర‌పై సంచ‌ల‌నం సృష్టించిన `షోలే` చిత్ర పోస్ట‌ర్‌ని `ధోలే`గా మార్చి..(దోలే అంటే కడుక్కోవడం) ఇక‌పై ఇలాంటి పోస్ట‌ర్‌లు చూడాలేమో అని ట్వీట్ చేశాడు. వైర‌స్ ఇలాగే ప్ర‌పంచాన్ని క‌మ్మేసి ఎక్కువ కాలం వుంటే రానున్న రోజుల్లో ఇలాంటి పోస్ట‌ర్‌ల‌ని చూస్తామేమో అని ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: