నందమూరి తారక రామారావు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన హీరో నందమూరి బాలకృష్ణ. మొదటినుంచి మాస్ ప్రేక్షకులను బేస్ చేసుకొని ఎంతగానో క్రేజ్ సంపాదించారు బాలకృష్ణ. ఇక బాలకృష్ణ పేరు చెబితే చాలు మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిపోతూ ఉంటారు. ఎందుకంటే బాలయ్య సినిమాలు మాస్ ప్రేక్షకులను అంతగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పటివరకు బాలయ్య చాలా మాస్ యాక్షన్ సినిమాల్లో నటించారు. ఎంతో మంది దర్శకులతో పని చేశారు. ఎన్నో యాక్షన్ సన్నివేశాలను అదరగొట్టారు. కానీ బాలకృష్ణతో ఏ  దర్శకుడు ఇవ్వలేనంత ఎంటర్టైన్మెంట్ ఆ దర్శకుడు ప్రేక్షకులకు ఇచ్చాడు. 

 

 

 బాలకృష్ణ ను ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించాడు దర్శకుడు. దీంతో మొదటి సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇక వీరిద్దరి కాంబినేషన్ తెలుగు చిత్ర పరిశ్రమలో హిట్ కాంబినేషన్ గా మారిపోయింది. ఇంతకీ ఈ కాంబినేషన్ ఎవరిది అంటారా. నందమూరి బాలకృష్ణ... మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చిందంటే చాలు ప్రేక్షకులు అందరూ పండగ చేసుకుంటారు అని చెప్పాలి. ఇక నందమూరి అభిమానులు అయితే తెగ సంబరపడిపోతూ ఉంటారు. నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ మొదట సింహా సినిమాలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. సినిమాలో  నందమూరి బాలకృష్ణ యాక్షన్,  డైలాగ్ డెలివరీ అన్ని ప్రేక్షకులను తెగ ఆకర్షించాయి. 

 

 

 ఇక ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ విజయాన్ని కట్టబెట్టారు మాస్ ప్రేక్షకులు. ఇక ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. వీరిద్దరూ మొదటి సినిమా విజయం జోష్ ని రెండవ సినిమాలో కూడా కంటిన్యూ చేశారు. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది అనే చెప్పాలి. ఇక ఆ తర్వాత బాలకృష్ణ ఏ దర్శకుడితో సినిమా తీసిన అంతగా వర్కవుట్ అవ్వలేదు. దీంతో తనకు హిట్ ఇచ్చిన దర్శకుడు తోనే మరోసారి సినిమా తీయాలని భావించి... బోయపాటి తో ముచ్చటగా మూడోసారి సినిమా తీస్తున్నాడు. ఇక ఈ హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుండడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: