మెగాస్టార్ చిరంజీవికి క్రేజ్ అంతా ఇంతా కాదు. మెగాస్టార్  చిరంజీవి డాన్స్ కి  ఎవరైనా ఫిదా అవ్వక తప్పదు. బాస్ స్టెప్పులేస్తే మ్రోతమోగి పోవాల్సిందే. సినిమా హాల్లో విజిల్స్ మ్రోగిపోవాల్సిందే. చిరు డాన్స్, ఫైట్స్, యాక్టింగ్, కామిడీ, టైమింగ్ అన్నింటిలోను ఇతను నెంబర్ వన్నే. అయితే అనేక సినిమాలలో చిరంజీవి పాత్ర చెప్పుకోవడం ముఖ్యం. చిరు అభిమానుల గురించి ఇంక చెప్పనక్కర్లే. 

 

IHG

 

అప్పటి నుండి ఇప్పటి వరకు డాన్స్ని ఎంతో చక్కగా పర్ఫార్మ్ చేస్తూ వచ్చాడు. అలానే మన మెగాస్టార్ చిరంజీవి ఇన్ని 150 మైలు రాయని దాటి వచ్చాడు అంటే ఆ ఘనత ఎంతో.  ఆ ట్యాలంట్ని మనం వర్ణించక్కర్లేదు. కొంచెం గ్యాప్ తీసుకుని వచ్చినా బొమ్మ దద్దరిల్లిపోయేలా ఉంటంది. ఏది ఏమైనా ఫ్యాన్స్లో ఆ జోష్ తరగలేదు. 

 

అంత గొప్ప నటుడు మన మెగాస్టార్. ఆ క్రేజ్ నిజంగా రావడానికి కారణం ఆయన స్టైల్, డాన్సే. అమ్మడూ లెట్స్ డు కుమ్ముడు అంటూ ప్రేక్షకులని ముగ్ధులు చేసేసాడు మెగాస్టార్ చిరంజీవి. ఇలా మెగా స్టార్ అద్భుతాన్ని సృష్టించాడనే చెప్పాలి. మెగా స్టార్ అప్పట్లో గొప్ప విజేతగా నిలిచాడు. 

 

IHG

 

దర్శకుడు కె. రాఘవేంద్ర తో అనేక సినిమాలు తీసాడు. అడవి దొంగ , చాణక్య శపథం, కొండ వీటి దొంగ, రుద్ర నేత్ర, జగదేక వీరుడు అతి లోక సుందరి, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, ముగ్గురు మొనగాళ్లు, ఇద్దరు మిత్రులు, మంజునాథ ఇలా చిరంజీవి తో రాఘవేంద్ర రావు సినిమాలని ఇచ్చాడు. అనేక సినిమాలని ఇచ్చి ఎన్నో విజయాల్ని చిరంజీవి అందుకునేలా చేసాడు దర్శకుడు రాఘవేంద్ర రావు. ఇలా అనేక సినిమాలలో చిరంజీవి నటన చెప్పుకోదగ్గది. వీరిద్దరి కాంబినేషన్ ఎన్నో విజయాల్ని అందించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: