అక్కినేని నాగార్జున సినీ కెరీర్ లో అత్యుత్తమ సినిమాల్లో గీతాంజలి ఒకటి అని నిస్సందేహంగా. చెప్పవచ్చు. ఐతే ఈ అద్భుతమైన గీతాంజలి చిత్రం మణిరత్నం కి మొదటి తెలుగు సినిమా కావడం విశేషం. తమిళ ఇండస్ట్రీలో లెజెండరీ దర్శకుడిగా పేరొందిన మణిరత్నం ఎప్పుడైతే గీతాంజలి చిత్రాన్ని తెరకెక్కించారో ఆ నిమిషం నుండి అతని పేరు తెలుగు ఇండస్ట్రీలో మారుమోగింది. గీతాంజలి సినిమా లో... ఒక అమ్మాయి తన ప్రాణాలని త్వరలోనే కోల్పోతున్నానని తెలిసి కూడా ప్రకృతి లోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ తన ప్రతి క్షణాన్ని ఎంతో అద్భుతంగా గడుపుతుంది.




అయితే ఈ క్రమంలోనే ఆమెని ప్రేమించే ఒక వ్యక్తి తారసపడతాడు. ఈ రెండు జీవితాలని దగ్గరయ్యేలా చేసి ఒక ప్రణయ ప్రేమ దృశ్య కావ్యంగా మలచి తెలుగు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించారు. మేము చెప్పేది అతిశయోక్తిగా అనిపించినా... నాగార్జున కెరీర్లో అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే మరొక ఎత్తు గీతాంజలి చిత్రం చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం ప్రాణం పోసింది. టైటిల్ రోల్ లో కొత్త నటి గిరిజ కూడా అద్భుతంగా నటించి నాచురల్ గా నటించే నాగార్జున నే డామినేట్ చేసింది. వేటూరి సుందరరామ్మూర్తి రాసిన 'ఓ పాపా లాలి', 'ఆమనీ పాడవే' లాంటి పాటలు తెలుగు ప్రేక్షకుల మనసుల్ని నేరుగా తాకాయి.

 




1989 మే 12న విడుదలయిన గీతాంజలి చిత్రం ' ఎంత సమయం ఎంత కాలం మనం బతుకుతా మాకు తెలియదు కానీ బ్రతికినంత కాలం నవ్వుతూ సంతోషంగా జీవితాన్ని ఆస్వాదిద్దాం' అనే సందేశాన్ని ప్రజల్లోకి చాలా రమణీయంగా తీసుకెళ్లిన ఘనత మణిరత్నం కే దక్కుతుంది. అయితే హీరోగా నటించిన నాగార్జున మరొక సినిమా శివ కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ అవ్వడం తో అతనికి రెండు హిట్లు ఒకే ఏడాదిలో అందాయి. దాంతో నాగార్జున పేరు దశదిశలా మారుమోగింది. గీతాంజలి సినిమాకి బెస్ట్ ఫిలిం నేషనల్ అవార్డు రావడం పెద్దగా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ కథారచయితగా అని రత్నానికి అవార్డులు వచ్చాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాకి ఎన్నో అవార్డులు వచ్చి ఆ సమయంలో తెలుగు పరిశ్రమలో అన్ని సినిమా రికార్డులను చెరిపేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: