తెలుగు లో ఇప్పటి వరకు ఎన్ని కామెడీ షోలు ఎంట్రీ ఇచ్చినా.. జబర్ధస్త్ ని మాత్రం బీట్ చేయలేక పోతున్నాయి.  ఏడు సంవత్సరాల క్రితం మొదలైన జబర్ధస్త్ లో ఇప్పటి వరకు ఎంతో మంది కమెడీయన్లు వచ్చారు.. వెళ్లారు.  కొంత మంది మాత్రం ఇందులోనే ఫిక్స్ అయ్యారు.  జబర్ధస్త్  పరిచయం అయిన నటులు వెండితెరపై కూడా వెలిగిపోతున్నారు. ఒకప్పుడు కామెడీ షోనే కదా అని చీప్‌గా తీసి పారేసిన వాళ్లు కూడా వామ్మో జబర్దస్త్ అంటున్నారు. రేటింగ్స్ పరంగా జబర్దస్త్ సృష్టించిన రికార్డులకు తిరుగులేదు. ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఏ షోకు సాధ్యం కాని రికార్డులకు తెరతీసింది.  


నాలుగు నెలల కింద ఈ షో నుంచి నాగబాబు బయటికి వచ్చేసాడు. ప్రస్తుతం ఆయన జీ తెలుగులో వస్తున్న అదిరింది కామెడీ షోకి జడ్జీగా వ్యవహరిస్తున్నారు. జబర్ధస్త్ నుంచి మెగాబ్రదర్ వెళ్లిపోయిన తర్వాత కూడా జబర్దస్త్ కామెడీ షోకు పెద్దగా నష్టం అయితే రాలేదు. అప్పుడు ఇప్పుడు రేటింగ్స్ మాత్రం అలాగే ఉన్నాయి. షోను నిలబెట్టడానికి తమ వంతు ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు నిర్వాహకులు.  అయితే జబర్ధస్త్ కి నాగబాబు స్థానంలో కొన్ని రోజులుగా ఒక్కో సెలబ్రెటీలు వస్తున్నారు.. అయితే రోజా పక్కన నాగబాబు స్థాయిలో ఎవరు మెప్పిస్తారన్న సందేహాలు కూడా వచ్చాయి. కానీ ఈ మద్య ప్రముఖ సింగర్, నటుడు మనో ఎంట్రీ ఇచ్చిన తర్వాత మంచి సందడి మొదలైంది.   


మంచి హ్యూమరీజం ఉన్న మనో జబర్ధస్త్ కి సరైన జడ్జీగా చెప్పుకుంటున్నారు. దాంతో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలకు జడ్జిలు ఫిక్స్ అయినట్లు కనిపిస్తుంది. ఈ రెండు షోలకు మనో జడ్జిగా ఉండబోతున్నాడు. ఇదే విషయాన్ని హైపర్ ఆది కూడా కన్ఫర్మ్ చేసినట్లు ఈ మద్య వార్తలు వచ్చాయి.  జబర్దస్త్‌కు మనో వచ్చి.. ఎక్స్ ట్రా కోసం ఎవరో ఒకర్ని పట్టుకొచ్చిన మల్లెమాల ఇప్పుడు రెండింటికి ఈయన్నే కూర్చోబెట్టేసింది. మరి మనో మెగాబ్రదర్ స్థానాన్ని భర్తీ చెయగలడా లేడా అన్నది ముందు ముందు చూడాలి 

మరింత సమాచారం తెలుసుకోండి: