బోయపాటి శ్రీను దర్శకత్వం కొంచెం భిన్నంగా ఉంటుంది. చక్కటి దర్శకత్వం తో బోయపాటి శ్రీను ప్రేక్షకులని మెప్పిస్తాడు. సినీ రంగంలో బోయపాటి ప్రవేశం కాస్త అనుకొనిదనే చెప్పాలి. పోసాని కృష్ణ మురళి ఇంటికి వచ్చినప్పుడు హైదరాబాద్ రమ్మని సూచించడం జరిగింది. అందుకే బోయపాటి శ్రీను హైదరాబాద్ వెళ్లి అక్కడ ముత్యాల సుబ్బయ్య దగ్గర దర్శకత్వం శాఖలో చేరాడు బోయపాటి.

 

IHG

 

 

అయితే ఆ సమయం లో పవిత్ర బంధం షూటింగ్ పూర్తి అవుతోందిట. ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం, అన్నమయ్య, గోకులంలో సీత ఇలా పలు పలు సినిమాలని దర్శకత్వం వహిస్తుంటే సహాయకునిగా పని చేసాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత బాగా అవగాహన లభించక పలు కధలు వ్రాయడం ప్రారంభించాడు బోయపాటి శ్రీను. 

 

మొదట శ్రీను భద్ర, తులసి సినిమాలకి దర్శకత్వం వహించాడు. అయితే మొదట ఈ కధ అల్లు అర్జున్ తో తీద్దామనుకుంటే అల్లు అరవింద్ నో చెప్పడంతో ఈ కధకి దిల్ రాజు కొంచెం కామిడి పెట్టి మాస్ మహారాజ రవితేజ తో ఈ సినిమా తీయడం  జరిగింది. అదే భద్ర సినిమా. తర్వాత విక్టరీ వెంకటేష్ తో తులసి సినిమా తీసాడు. అలా సింహ, దమ్ము, లెజెండ్, సరైనోడు, జయ జానకి నాయక, వినయ విధేయ రామ వంటి సినిమాలని అందించాడు దర్శకుడు బోయపాటి శ్రీను.

 

IHG

 

లెజెండ్ సినిమాకి గాను నంది ఉత్తమ దర్శకుడు పురస్కారం సొంతం చేసుకున్నాడు. అంతే కాకుండా పలు అవార్డుని కూడా బోయపాటి దక్కించుకున్నాడు. నందమూరి బాలకృష్ణ కి బోయపాటికి మధ్య కధలు హిట్ కావడంతో ఈ కాంబినేషన్ కి అనేక ప్రశంసలు వచ్చాయి. సింహ, లెజెండ్ సినిమాలతో బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ హైలెట్ అంటూ పొగడ్తలు వినిపించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: