కరోనా ప్రభావంతో వినోద పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటికే దాదాపు అన్ని చోట్ల సినిమా థియేటర్లు మూత పడ్డాయి. ప్రముఖ నిర్మాణ సంస్థలు స్వచ్చందంగా షూటింగ్‌ లు నిలిపివేశాయి. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు షూటింగ్ లు తిరిగి ప్రారంభించేది లేదని తేల్చి చెప్పేవాయి. ఈ నేపథ్యంలో సినీ కార్మికుల పరిస్థితి చర్చనీయాంశంగా మారింది.

 

రోజు కూలి కి పని చేసే సినీ కార్మికులు పరిస్థితి షూటింగ్‌ లు ఆగిపోవటం తో దుర్భరంగా మారింది. దీంతో వారిని ఆదుకునేందుకు భారతీయ ప్రొడ్యూసర్‌ గిల్డ్‌ చర్యలు చేపట్టింది. `ప్రొడ్యూసర్‌ గిల్డ్ ఈ రోజు కార్మికుల కోసం రిలీఫ్‌ ఫండ్‌ ను రెడీ చేస్తున్నట్టుగా ప్రకటించింది.

 

షూటింగ్ లు పూర్తిగా నిలిపివేయటంతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికుల కోసం ఈ రిలీఫ్‌ ఫండ్‌ ను వినియోగించనున్నట్టు` గా ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్స్‌ గిల్డ్ అధ్యక్షుడు సిద్ధార్థ్ రాయ్‌ కపూర్‌ అధికారికంగా ప్రకటించారు. కార్మికులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకు రావాలి ఆయన కోరారు. ఇన్నాళ్లు మనతో కలిసి పని చేసిన వారిన ఆదుకునేందుకు మనమంతా చేతులు కలిపి సాయం చేయాలని ఆయన కోరారు.

 

సాయం చేయాలనుకునే వారు గిల్డ్‌ ను మెయిల్ ద్వారా సంప్రదించాలని కోరారు. దేశంలో కరోనా విస్తరిస్తుండటంతో ఇండియన్‌ మోషన్‌ పిక్చర్స్‌ ప్రొడ్యూసర్స్‌ అసోషియేషన్‌ మార్చి 19 నుంచి అన్ని రకాల షూటింగ్‌ లను నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. తిరిగి షూటింగ్‌ లు ఎప్పుడు ప్రారంభించాలి అన్న విషయాన్ని మార్చి 30 న చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

 

ఇప్పటికే పలువురు సినీ తారలు తమ వంతు సాయం అంధించేందుకు ముందుకు వస్తున్నారు. మరి కొందరు ప్రజల్లో అవేర్‌నెస్‌ కలిగించేందుకు సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: