సురేందర్ రెడ్డి డైరెక్షన్ ఎంత క్రియేటివిటీ గా... ఎంత డిఫరెంట్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2005లో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కించిన అత‌నొక్క‌డే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సురేందర్ రెడ్డి తన తొలి సినిమా నుంచి మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా వరకూ ఆయ‌న క‌థ‌, క‌థ‌నాలు ఎంతో వైవిధ్యంతో ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సురేంద‌ర్ రెడ్డి కి ఎన్టీఆర్‌, మ‌హేష్‌బాబు లాంటి వాళ్లు మంచి ఛాన్సులు ఇచ్చినా ఆయ‌న ఉప‌యోగించుకో లేక‌పోయారు. ఎన్టీఆర్ అశోక్, ఊస‌రవెల్లి సినిమాల‌తో రెండు సార్లు అవ‌కాశం ఇస్తే రెండు సార్లు కూడా సినిమాలు ప్లాప్ అయ్యాయి.

 

ఇక మ‌హేష్ బాబు అతిథి సినిమాకు అవ‌కాశం ఇస్తే ఆ సినిమా అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. అలా ఈ ఇద్ద‌రు స్టార్ హీరోలు ఇచ్చిన ఛాన్సుల‌ను సురేంద‌ర్ రెడ్డి వాడుకోలేదు. అయితే మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ కిక్ సినిమా మాత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు సురేంద‌ర్‌రెడ్డికి, అటు ర‌వితేజ కెరీర్‌కు మంచి ఊపు తీసుకు వ‌చ్చింది. అయితే ఆ త‌ర్వాత స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌తో తెర‌కెక్కించిన రేసుగుర్రం కూడా ఇద్ద‌రి కెరీర్ రేసుగుర్రంలా ప‌రిగెత్తించింది. 

 

ఆ త‌ర్వాత త‌న తొలి సినిమా హీరో, నిర్మాత క‌ళ్యాణ్ రామ్ ర‌వితేజ - సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్లో తెర‌కెక్కించిన కిక్ 2 సినిమా తీస్తే ఆ సినిమా అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. కిక్ లాంటి హిట్ సినిమా కామెడీ ప‌రంగా.. క‌థ‌, క‌థ‌నాల ప‌రంగా అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మైంది. అయితే ఆ త‌ర్వాత కిక్ 2లో అవేవి లేక‌పోవ‌డంతో సినిమా సోదిలో లేకుండా పోవ‌డంతో పాటు క‌ళ్యాణ్‌రామ్‌ను న‌ష్టాల్లో ముంచేసింది. ర‌వితేజ కూడా ఆ సినిమా త‌ర్వాత మ‌ళ్లీ కోలుకోలేక పోయాడు. రాజా ది గ్రేట్ వ‌చ్చినా అది మ‌నోడి కెరీర్‌ను ప‌రుగులు పెట్టింలేక‌పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: