ఇప్పటికే ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ప్రభావంతో అందరూ ఎంతో భయాందోళనలకు గురవుతున్న విషయం తెలిసిందే. మన దేశంలో కూడా ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం వ్యాధి ప్రబలకుండా పలు సూచనలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ మహమ్మారి పై ప్రతి మతం లోని ప్రముఖ మత పెద్దలు పలు చర్చిలు, గుళ్ళు, మసీదుల్లో వ్యాధి తగ్గాలని, అలానే ప్రపంచంలోని ప్రజలు అందరూ సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్ధనలు కూడా చేస్తున్నారు. 

 

అయితే ఈ వ్యాధిపై ప్రముఖ క్రిస్టియన్ మత ప్రబోధకుడు కేఏ పాల్ నేడు ఒక వీడియో బైట్ ద్వారా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం అన్ని దేశాలు కూడా కరోనా దెబ్బకు వణికిపోతున్నాయి. అందుకోసం మన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నేనొక ఆఫర్ ఇస్తున్నాను, అదేమిటంటే, అవసరం అయితే మా సంస్థకు సంబందించిన కొన్ని ప్రార్ధన హాల్స్ ను పేషంట్లను ఐసొలేట్ చేయడానికి వాడుకోవచ్చని, అందుకోసం ఎన్ని హాల్స్ ని అయినా తమ మత సంస్థ తరపున ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు పాల్. అంతేకాదు, ప్రభువుకు తాను ఈ వ్యాధిని రూపుమాపాలని ఇప్పటికే ప్రార్ధనలు చేస్తున్నట్లుకూడా చెప్పారు పాల్. 

 

అయితే పాల్ వీడియో పై స్పందించిన రామ్ గోపాల్ వర్మ, నువ్వు ఉచిత సలహాలు, సూక్తులు చెప్పేబదులు, మీ దేవుడితో చెప్పి కారొనను రాకుండా ఆపవచ్చును కదా. నిజంగా నీకు దేవుడి దగ్గర అంత సీన్ ఉంటే, నేను తిట్టిన తిట్లకు ఈ పాటికి నాకు కరోనా వచ్చేలా చేయమని మీ దేవుడికి చెప్పవచ్చును కదా సుబ్బారావు అంటూ వర్మ కొంత సెటైరికల్ గా పాల్ పై తన ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ చేసారు. వాస్తవానికి గతంలో కూడా అమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా విషయంలో వర్మకు పాల్ కు మధ్య కొన్ని విబేధాలు తలెత్తిన విషయం తెలిసిందే. మరి తాజాగా వర్మ తనపై పేల్చిన ఈ సెటైర్లపై పాల్ ఏ విధంగా బదులిస్తారో చూడాలి......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: