క్రేజీ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాధ్‌, సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌ల కాంబినేష‌న్ అంటే మాత్రం మాములు విష‌యం కాద‌నేచెప్పాలి. వీళ్ళ‌ద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చే సినిమాల‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాద‌ని చెప్పాలి. ఇక వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన రెండు చిత్రాలు హిట్ అనే చెప్పాలి. పోకిరి, బిజినెస్‌మ్యాన్ రెండూ కూడా హిట్ ఖాతాలోనే ఉన్నాయి. ఇక మ‌హేష్‌బాబు అప్ప‌టి వ‌ర‌కు న‌టించిన చిత్రాల‌న్నీఒక ఎత్త‌యితే పోకిరి చిత్రంతో మ‌హేష్ క్రేజ్ అమాంతం పెరిగేలా చేసేశాడు పూరి. పూర్తి మాస్ లుక్‌లో మాస్ యాక్ష‌న్‌తో అద‌ర‌గొట్టేశాడు మ‌హేష్‌. ఇక వీరిద్ద‌రు ఊహించ‌ని విధంగా ఈ సినిమా వ‌చ్చింది. అప్ప‌టి వ‌ర‌కు మ‌హేష్ ఫ్యాన్స్ మ‌హేష్‌నుంచి ఎక్స్‌పెక్ట్ చెయ్య‌ని విధమైన యాక్ష‌న్‌ని పోకిరి చిత్రంలో చూశారు. ఇందులో ఉండే ప్ర‌తి డైలాగ్ సూప‌ర్ హిట్ అయ్యాయి. అలాగే హీరోయిన్ ఇలియానా, మ‌హేష్ ల మ‌ధ్య వ‌చ్చే ప్ర‌తి స‌న్నివేశం హైలెట్‌గా నిలిచాయి. 

 

అలాగే విల‌న్ ప్ర‌కాష్‌రాజ్‌కి మ‌హేష్ కి మ‌ధ్య వ‌చ్చే ప్ర‌తి స‌న్నివేశం చాలా ఇంట్ర‌స్టింగ్‌గా కొత్త‌గా మ‌హేష్ కెరియ‌ర్‌లో మ‌రో మైలురాయిగా నిలిచింది ఈ చిత్రం. పోకిరిలోని ప్ర‌తి సాంగ్ ప్ర‌తి స‌న్నివేశం ఇప్ప‌టికీ ప్రేక్ష‌కులు గుర్తు చేసుకుంటుంటారు. ఇక ఆ చిత్రంలో వేసే ప్ర‌తి పంచ్ అదుర్స్ అనే చెప్పాలి. ఇక ఆత‌ర్వాత వ‌చ్చిన బిజినెస్ మ్యాన్ కూడా హిట్ అనే చెప్పాలి. అందులో డైలాగ్స్ అన్నీ కూడా సూప‌ర్ హిట్ అయ్యాయి. మ‌మ్మ‌ల్ని మించిన తోపులెవ్వ‌రూ లేరిక్క‌డ అని అనే డైలాగ్ ఫ్యాన్స్ ని ఫుల్ ఎన‌ర్జీని ఇచ్చింది. ఇక వీరి కాంబినేష‌న్‌లో రాబోయే మూడో చిత్రం జ‌న‌గ‌ణ‌మ‌న కాని ఎందుకో కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ చిత్రం ఆగిపోయింది. ఇప్పుడు మ‌ళ్ళీ వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమాలు రావాల‌ని చాలామంది కోరుకుంటున్నారు. అయితే పూరి సినిమాల‌న్నీ ఫ్లాప్ బాట‌ప‌ట్ట‌డంతో మ‌హేష్ కొంత గ్యాప్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: