దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎక్కడిక్కడ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో క్రమంగా కరోనా వైరస్ విస్తరిస్తుంది. ఈ వైరస్ తీవ్రతను కట్టడి చేయడానికి ఎన్ని విధాలుగా చర్యలు చేపట్టినా సరే అది కంట్రోల్ అయ్యే పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తుంది. దీనితో ప్రభుత్వాలు జనాలు గుమి గూడె విధంగా ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. 

 

ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నారు. సినిమాలను బంద్ చేసారు, వేడుకలను, పెళ్ళిళ్ళను బంద్ చేసారు, త్వరలోనే మరికొన్ని కూడా రద్దు చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక ఇది పక్కన పెడితే విడుదల అయ్యే సినిమాలకు కరోనా వైరస్ దెబ్బ గట్టిగా తగిలే అవకాశాలు కనపడుతున్నాయి. అనుష్క నటిస్తున్న నిశ్శబ్దం సినిమా వచ్చే నెల రెండో తేదీన విడుదల అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాన్ని చాలా జాగ్రత్తగా చేస్తుంది. 

 

అయితే ఇప్పుడు సినిమా విడుదలను వాయిదా వేసే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వం సినిమా హాల్స్ తెరిచే ప్రయత్నం చేయవద్దని చేస్తే మాత్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరిస్తూ వస్తుంది. దీనితో ఈ సినిమా విడుదల అయినా సరే ఆ సినిమాను చూడటానికి ప్రేక్షకులు కూడా వచ్చే పరిస్థితి ఎక్కడా కనపడటం లేదనే చెప్పాలి. అందుకే విడుదల చేయవద్దని భావిస్తున్నారు. ఇప్పటికే పలు సినిమా షూటింగ్ లను కూడా వాయిదా వేసేసారు. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమాను హేమంత్ మధుకర్ అనే దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి విడుదల అవుతుందో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి: