కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు సినిమాలపై పడే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పటికే పలు సినిమాల విడుదలను అటు బాలీవుడ్ లో ఇటు తెలుగులో వాయిదా వేసారు. కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పలు సినిమాల షూటింగ్ ని కూడా వాయిదా వేసారు. దీనితో ఇప్పుడు సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు ఎక్కడా కనపడటం లేదు. దేశంలో అన్నీ రంగాలు ఇప్పుడు కరోనా కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఆ ప్రభావం సినిమా ల మీద ఎక్కువగా పడింది. స్టార్ హీరోల సినిమాలు అన్నీ కూడా వాయిదా పడ్డాయి. 

 

అగ్ర దర్శకులు కూడా ఇప్పుడు పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకుని... వాయిదా వెయ్యాలని భావిస్తున్నారు. ఎక్కడిక్కడ సినిమాల షూటింగ్ ని దేశ వ్యాప్తంగా ఆపేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దేశంలో ఈ ఏడాది ఏ సినిమాను విడుదల చేసే అవకాశం లేదని అంటున్నారు. దేశంలో కరోనా వైరస్ ఇప్పుడు తీవ్రంగా ఉన్న నేపధ్యంలో సినిమాల విడుదలను వాయిదా వేసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రభుత్వాలు కూడా అనుమతించే పరిస్థితి లేదని అంటున్నారు. 

 

దీనితో స్టార్ హీరోల కు నిర్మాతలు గా వ్యవహరిస్తున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని అంచనా వేయలేక ప్రభుత్వాలు కూడా సతమవుతున్నాయి కాబట్టి ఎప్పుడు షూటింగ్ మొదలుపెడతారు అనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది. తెలుగులో స్టార్ హీరోల సినిమాలు అన్నీ షూటింగ్ ని దాదాపుగా వాయిదా వేసారు. చిరంజీవి, రాజమౌళి, సినిమాలు ఇప్పటికే షూటింగ్ ని ఆపేశాయి. త్వరలోనే మరికొన్ని సినిమాల షూటింగ్ ని ఆపేసి అందరూ హైదరాబాద్ వెళ్ళిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. పరిస్థితి ఏమైనా మెరుగు పడితే మాత్రం... జూన్ లేదా జులై తర్వాత విడుదల చేయడం ఖాయమని అంటున్నారు. లేదా ఇక ఈ ఏడాది ఏ ఒక్క సినిమా కూడా విడుదల చేసే అవకాశం లేదని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: