టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులకు ఒకరకంగా పండగ. ఆయన సినిమా విడుదల అవుతుంది అంటే చాలు పనులు పక్కన పెట్టుకుని మరీ చూసే ఉద్యోగులు కూడా ఉన్నారు. టాలీవుడ్ లో ఆయన సినిమాలకు ఉండే క్రేజ్ ఎప్పటికి తగ్గే అవకాశం ఉండదు. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి దూకుడుగా సినిమాలు చేస్తున్నారు. దీనితో ప్రేక్షకులు ఆయన సినిమాల విషయంలో అదే దూకుడుగా ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆయన సైరా సినిమా ఫ్లాప్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. 

 

ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ ని ఆచార్యా అని అనుకుంటుంది చిత్ర యూనిట్. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. చిరంజీవి ఈ టైటిల్ వైపే మొగ్గు చూపుతున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దర్శకుడు కొరటాల శివ కూడా అలాగే ఈ టైటిల్ కావాలని అడుగుతున్నారట. అయితే నిర్మాత రామ్ చరణ్ మాత్రం టైటిల్ వద్దని మరో టైటిల్ ని చూడమని చెప్పినట్టు సమాచారం. దీనితో చిత్ర యూనిట్ లో కీలక సభ్యులు టైటిల్ ని ఖరారు చేసే పనిలో పడ్డారు. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. 

 

ఇది పక్కన పెడితే ఈ సినిమాకు ఇప్పుడు హీరోయిన్ ఎవరూ దొరకడం లేదని అంటున్నారు. ముందు ఈ సినిమాకు త్రిష అనుకున్నా ఆమె ఆసక్తి చూపించడం లేదని, దీనితో కాజల్ పేరుని పరిశీలిస్తున్నారు అనే ప్రచారం జరిగింది. చిరంజీవి కూడా కాజల్ పేరుని ప్రతిపాదించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ అనుష్క పేరుని ఖరారు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమా కు కరోనా దెబ్బ బాగా తగిలింది. వచ్చే ఏడాది వరకు సినిమా వచ్చే అవకాశాలు కనపడటం లేదు. మరి ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: