టాలీవుడ్ లో అక్కినేని వారి కోడలు సమంతాకు ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఆమె సినిమాల్లోకి అడుగు పెట్టి దాదాపు పదేళ్ళు దాటినా సరే ఆమెకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకుని దూసుకుపోతుంది. ఆమెతో సినిమాలు చెయ్యాలి అనుకున్న స్టార్ హీరోలు కూడా ఎక్కువగానే ఉన్నారు. ప్రస్తుతం ఆమె పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. అయినా వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది. అగ్ర హీరోల పక్కన సినిమాలు చెయ్యాలని ఆమెకు అవకాశాలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. 

 

అయినా సరే ఆమె మాత్రం ఎక్కువగా సోలోగా నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలే ఎక్కువగా చేస్తూ వస్తుంది. ఇది పక్కన పెడితే ఆమె ఇంట్లో సినిమా వద్దని చెప్పినా సరే సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించి ఇటీవల కొందరు దర్శకులతో చర్చలు కూడా జరిపింది అనే వార్తలు వచ్చాయి. దీనిపై నాగ చైతన్య సీరియస్ గా ఉన్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆమెను సినిమా చేయవద్దని ఇంట్లో వాళ్ళు ఎన్ని సార్లు చెప్పినా సరే తనకు అవకాశాలు వస్తున్నాయని తాను అవకాశాలను వదులుకునే ఆలోచనలో లేనని స్పష్టంగా చెప్తున్నట్టు సమాచారం. 

 

ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ సినిమా కోసం త్రివిక్రమ్ హీరోయిన్ ని ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే సమంతాతో ఆయన చర్చలు కూడా జరిపే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాను చేయవద్దని నాగచైతన్య స్పష్టంగా చెప్పినా సరే ఆమె మాత్రం ఆగడం లేదని అంటున్నారు. నాగార్జున కూడా ఇక సినిమాలు వద్దని ఆమెకు చెప్పెసారట. మరి ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: