స‌మంత అక్కినేని.. పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు.  ‘ఏమాయ చేశావే’ సినిమాతో తన సినీ కెరీర్‌ని ప్రారంభించిన సమంత.. ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించి ప్ర‌స్తుతం స్టార్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా నిలిచారు. దాదాపు సమంత నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ మూవీసే. ఈమెపై అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా లెక్క‌లు అవ‌స‌రం లేదు. ఇక నాగచైత‌న్య‌ను పెళ్లి చేసుకొని అక్కినేని కోడలిగా అత్తారింట అడుగుపెట్టిన సమంత గత రెండేళ్లుగా వెండితెరపై మ‌రింత‌ జోష్ కొనసాగిస్తూ వస్తోంది.

 

వాస్త‌వానికి పెళ్లి తర్వాత యాక్టింగ్‌కి పుల్‌స్టామ్ పెట్టేస్తుంది అనుకున్నారు. కానీ అటు ఫ్యామిలీని చక్కదిద్దుకుంటూ, ఇటు కెరీర్‌ పరంగా కూడా భారీ హిట్లను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. ముఖ్యంగా పెళ్లయ్యాక కూడా స‌మంత‌ వరుస హిట్స్ ఖాతాలో పడటమే గాక పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. అలాగే తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ భలే జోడీ అనిపించుకున్నారు నాగచైతన్య, సమంత. పెళ్లికి ముందు పలు విజయాలు అందుకొన్న ఈ జోడీ పెళ్లి తర్వాత ‘మజిలీ’తో ప్రేక్ష‌కుల ముందు వ‌చ్చి హిట్ కొట్టారు.

 

ఇక ఇటీవ‌ల జ‌రిగిన ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. పెళ్లి తర్వాత సినిమాలు చేసే విషయంలో తనకు, భర్త చైతూకు గొడవైందని సంచలన విషయాలు బయటపెట్టింది సమంత. అంటే నెగ‌టీవ్ వేలో ఆలోచించ‌కండీ సుమీ.. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. నిజానికి పెళ్లి తర్వాత సినిమాలు మానెయ్యాలని తను అనుకున్నానని, ఆ నిర్ణయం విని చైతన్య తనను తిట్టాడని సమంత చెప్పుకొచ్చింది.

 

సినిమాల్లో నటించే అవకాశం అందరికీ రాదు.. వచ్చినా స్టార్స్‌గా గుర్తింపు తెచ్చుకోవడం సాధ్యం కాదు.. అలాంటి అవకాశం వచ్చినపుడు నీవెందుకు నీకుగా వదిలేసుకుంటావ్.. పిచ్చి కానీ పట్టిందా అంటూ తనపై సీరియస్ అయ్యాడని చెప్పింది సమంత. మ‌రియు అవకాశాలు వచ్చినన్ని రోజులు సినిమాలు చెయ్యమని చైతూ చెప్పాడ‌ని.. అందుకే సినిమాలు చేస్తున్నాన‌ని క్లారిటీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: