టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఒక వెలుగు వెలిగి కనుమరుగు అయిన హీరోయిన్ లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. స్టార్ హీరోలు అందరితో ఆమె ఆడి పాడింది. ఆ తర్వాత ఒక్కసారిగా టాలీవుడ్ నుంచి దూరమై బాలీవుడ్ లో వరుస అవకాశాలను దక్కించుకుంటుంది. ఆమె మళ్ళీ ఇప్పుడు తెలుగులో సినిమాలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. తనకు ఉన్న పరిచయాల ద్వారా ఆమె ఎక్కువగా ఒక మెగా హీరోను తరుచుగా కలుస్తున్నట్టు తెలుస్తుంది. ఆమె తెలుగులో చేసిన సినిమాల్లో ఎక్కువగా ఫ్లాపులు ఉన్నాయి. 

 

అయితే ఇప్పుడు మాత్రం ఆమె చాలా జాగ్రత్తగా సినిమాలు చెయ్యాలని చూస్తుంది. ఆ మెగా హీరో వద్ద కూడా ఇదే విషయాన్ని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పినట్టు సమాచారం. తనకు ఒక్క అవకాశం ఇప్పిస్తే తాను ప్రూవ్ చేసుకుంటా అని చెప్పినట్టు సమాచారం. మరి ఇది ఎంత వరకు నిజమో గాని ఇటీవల ఆమె ఒక షూటింగ్ స్పాట్ లో ఆమె వెళ్లి మెగా హీరో ని కలిసినట్టు తెలుస్తుంది. ఆ హీరో ఆమెకు హెల్ప్ చేస్తా అని చెప్పినట్టు సమాచారం. మరి ఆమెకు ఏ అవకాశాలు ఇస్తాడో తెలియదు. తన పరిచయాల ద్వారా ఎక్కువగా హెల్ప్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 

 

ఆమె కూడా ఈసారి ఒక్క అవకాశం వస్తే వదులుకోవద్దు అనే భావనలోనే ఉందని అంటున్నారు. గతంలో గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చిన ఆమె ఇప్పుడు మాత్రం నటనకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తుంది. బాలీవుడ్ లో అవకాశాలు వచ్చినా వద్దని తాను తెలుగులోనే చేస్తాను అని చెప్పినట్టు సమాచారం. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఆమె మాత్రం గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. త్వరలోనే ఆమె ఒక సినిమాలో కనపడే అవకాశం ఉందని కూడా టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: