కెప్టెన్ ఒక్కడే బాగా ఆడితే టీమ్ గెలవదు. జట్టంతా ఆడితేనే విజయాలు దరి చేరతాయి. దానికి వైకుంఠపురాన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు నెటిజన్లు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు టెక్నీషియన్లు బెస్ట్ ఇవ్వడం వల్లే అల వైకుంఠపురములో అర్జుఅర్జున్ అదరగొట్టాడని కామెంట్ చేస్తున్నారు. ఎడిటర్ డెసిషన్ లో డిస్ట్రిబ్యూటర్లు లాభపడ్డారని పోస్టులు పెడుతున్నారు. 

 

అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురములో. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 150కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ఇంత కలెక్ట్ చేసిన ఈ వైకుంఠపురముపై ఇప్పుడు నెటిజన్లు కామెంట్ లు కురిపిస్తున్నారు. బన్ని, సుశాంత్ ల  అర్జున్ రెడ్డి 2 సీన్ ని తీసేసి మంచి పని చేశారని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. 

 

అల వైకుంఠపురములో టీమ్ రీసెంట్ గా ఓ డిలీటెడ్ వీడియోను రిలీజ్ చేసింది. ఎడిటింగ్ లో తీసేసిన ఓ సీన్ ను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. ఇందులో బన్ని, సుశాంత్ చెడు అలవాట్లను రివీల్ చేస్తాడు. ఈ సీన్ అప్ లోడ్ అయిన వెంటనే ఎన్ని వ్యూస్ వచ్చాయో.. అంతే లెవల్ లో నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

 

అల వైకుంఠపురములో ఈ సీన్ ను తీసేసి మంచి పని చేశాడని.. లేకపోతే వైకుంఠపురానికి నెగిటివ్ రిజల్ట్ వచ్చేదని ట్రోల్ చేస్తున్నారు. సుశాంత్ నైట్ లైఫ్ ను బన్ని రివీల్ చేసుంటే కిక్ వచ్చేది కాదనీ.. క్లైమాక్స్ లో సుశాంత్ ఒప్పుకోవడమే బాగుందని కామెంట్ చేస్తున్నారు. సో నెటిజన్లు డిలీటెడ్ సీన్ గురించి కూడా ఇంత మాట్లాడుతున్నారంటే ఈ మూవీ వాళ్లకు ఎంత దగ్గరయిందో చెప్పొచ్చు. మొత్తానికి ఆ సీన్ డిలీట్ చేయడం వల్ల అల వైకుంఠపురములో సినిమాకు పెద్ద ప్రమాదమే తప్పింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: