టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ చేసిన అతి ఎవరూ చేయరు అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉంటారు. అతను ఎంత అతి చేసినా సరే అతన్ని ఎక్కువగానే ఫాలో అవుతూ ఉంటారు యువత. సోషల్ మీడియాలో అతనికి మంచి క్రేజ్ ఉంది. అతని సినిమాలు అనగానే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ముఖ్యంగా యూత్ అతని సినిమాల కోసం ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం అతను వరుస ఫ్లాపులతో ఉన్నా సరే మంచి సినిమాలు చేయడానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే అతని సినిమాలకు ఇప్పుడు క్రేజ్ తగ్గింది అంటున్నారు. 

 

కొందరు అతని సినిమాల మీద తప్పుడు ప్రచారం చేయించడం మొదలుపెట్టారు. దీనితో అతను ఊహించని విధంగా నష్టపోయాడు అనే టాక్ వినపడుతుంది. అయితే అతను చేసిన కాస్త ఓవర్ యాక్షన్ కొందరికి కోపం తెప్పించింది అంటున్నారు. యువ హీరోల్లో కొందరు అతన్ని ఎక్కువగా టార్గెట్ చేసారని అతని సినిమాలకు వ్యతిరేకంగా కొందరు కావాలనే ప్రచారం చేయించడం మొదలుపెట్టారని సమాచారం. అతను అనవసరంగా కొందరి మీద ఒక పార్టీలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడని ఆ వ్యాఖ్యల తర్వాత అతనికి మరింత ఇబ్బంది కర పరిస్థితి ఎదురైంది అంటున్నారు. 

 

అతను నటించిన ఒక సినిమా విషయంలో కొందరు చేసిన తప్పుడు ప్రచారానికి ఇదే కారణమని అంటున్నారు. మొన్నటి వరకు అతన్ని ఒక ఫ్యామిలీ టార్గెట్ చేసింది అనుకున్నారు. కాని కాదని అతన్ని యువ హీరోలు అందరూ టార్గెట్ చేసారని అంటున్నారు. సోషల్ మీడియాలో కూడా అతన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేయడం మొదలుపెట్టారని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే అతని కెరీర్ ని అతనే ఇబ్బంది పెట్టుకున్నాడు. కథలో వేలు పెట్టడం నుంచి సినిమా కార్యక్రమాల్లో చేసే వ్యాఖ్యల వరకు అన్నీ కూడా అతను తనకు తాను గా తెప్పించుకున్న ఇబ్బందులే.

మరింత సమాచారం తెలుసుకోండి: