దర్శకధీరుడు రాజమౌళి గురించి ఎంత చెపుతాం.. ఎం అని చెపుతాం? అయన సినిమాల శిల్పి.. సినిమా అద్భుతంగా రావడం కోసం ఎన్ని ఏళ్ళు అయినా సరే శ్రమిస్తూనే ఉంటాడు అంటే నమ్మండి. అయన చరిత్రలో ఒక్క సినిమా కూడా ప్లాప్ అయినట్టు లేదు. అంత గొప్పగా సినిమాలు చేస్తాడు.    

 

IHG

 

అయన మొదటి సినిమా నుండి అంతే.. ఎంతో గొప్పగా సినిమాలు తీశాడు. స్టూడెంట్ నెంబర్ 1 నుండి ఇప్పటి వరుకు తీసిన బాహుబలి సినిమాలు అన్ని కూడా సూపర్ హిట్టే. అలాంటి అద్భుత దర్శకుడు రాజమౌళి. అలాంటి రాజమౌళి సినిమాను ఏ హీరో అయినా రిజెక్ట్ చేస్తాడా? రిజెక్ట్ చేసే అంత సిన్ ఏ హీరోకు అయినా ఉందా? అంటే ఉంది అని చెప్పాడు. 

 

IHG

 

హీరో ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరు? ప్రభాస్. రెబెల్ స్టార్ ప్రభాస్.. ఏంటి ప్రభాస్ రిజెక్ట్ చేశాడా అంటే రిజెక్ట్ చేశాడు అనే అంటున్నారు. ఆ సినిమా ఏంటి? ఎందుకు రిజెక్ట్ అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన సింహాద్రి కథ ముందుగా ప్రభాస్ కే చెప్పారట.. 

 

IHG

 

కానీ రాజమోళి అంతకు ముందుకు చేసిన స్టూడెంట్ నంబర్‌ వన్‌ ఓ మామూలు కాలేజ్‌ కథ కావటంతో సింహాద్రి లాంటి భారీ చిత్రాన్ని రాజమౌళి హ్యాండిల్‌ చేయగలడో లేదో అన్న అనుమానంతో ప్రభాస్‌ ఆ సినిమాను పక్కన పెట్టేశాడట. ఆతర్వాత ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం కావడంతో ప్రభాస్ బాగా హర్ట్ అయ్యాడు అంట..    

మరింత సమాచారం తెలుసుకోండి: