బుల్లితెర సూపర్ నటుడు, కమెడియన్, యాంకర్, డాన్సర్ అన్ని కలగలిపిన స్టార్ సుడిగాలి సుధీర్. జబర్దస్త్ కామెడీ షోలో  మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు  సుధీర్. కానీ ఎప్పుడు సుధీర్ చేసిన పనికి బాలయ్య ఫ్యాన్స్ నిజంగానే ఫిదా అయిపోతున్నారు. మనోడు ఏం చేసినా కూడా బుల్లితెరపై సంచలనమే. జబర్దస్త్ కామెడీ షోతో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటు మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు సుడిగాలి సుధీర్.అంచలంచలుగా పైకి ఎదుగుతున్నాడు. రెండు సినిమాలో హీరోగా కూడా నటించాడు. కానీ సినిమాల్లో రాణించలేకపోయాడు. అయిన ఏ మాత్రం తీసిపోలేదు సుధీర్. బుల్లితెరలో మంచి షోస్ చేస్తున్నాడు.  ఇప్పుడు తన స్థాయి పెంచుకుంటున్నాడు. బుల్లితెరపై మనోడి ఇమేజ్ చూస్తుంటే నిజంగానే మెంటల్ వచ్చేస్తుంది. స్టార్ హీరోలు సినిమాలతో ఎంత మ్యాజిక్ చేస్తారో.. టీవీల్లో సుధీర్ కూడా అంతే మ్యాజిక్ చేస్తున్నాడు.డీ షో గాని, పోవే పోరా షోలకి యాంకరింగ్ చేస్తూ అదరగొడుతున్నాడు.

 


 తెరపై ఏ యాంకర్ తో చేసిన కెమిస్ట్రీ అదరగొడతాడు. రష్మీ, స్రుప్రియ ఎవరితో అయిన సూపర్ జోడి. ఎక్కడ అడుగు పెడితే అక్కడ రేటింగ్స్ వర్షం కురుస్తుంది. ఎందుకంటే  సుడిగాలి సుధీర్ యాంకరింగ్ అయినా,  కామెడీ అయినా కూడా అలా ఉంటుంది మరి.అందుకే సుడిగాలి సుధీర్‌కు అంత క్రేజ్ ఉంటుంది.ప్రస్తుతానికి మల్లెమాలకు వెన్నుముకలా మారిపోయాడు ఈయన. ప్రత్యేకంగా ఈయనపైనే షోలు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఉగాది సందర్భంగా పండగ సర్ పండగ అంతే అంటూ ఓ భారీ ఈవెంట్ ప్లాన్ చేసింది ఈటీవీ. అందులో సుడిగాలి సుధీర్ కూడా ఉన్నాడు. ముఖ్యంగా మనోడు చేసిన ఓ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్వాతిలో ముత్యమంత అంటూ బాలయ్యను మరిపించేలా రెయిన్ డాన్స్ చేసాడు సుధీర్.

 


 బంగారు బుల్లోడు పాటకు ఈ బుల్లోడు పిచ్చెక్కించే స్టెప్పులేసాడు.వైట్ అండ్ వైట్‌లో సుధీర్ చేసిన డాన్సులు అదిరిపోయాయి. ముఖ్యంగా పాటలో వేసిన రెండు మూడు స్టెప్పులు అయినా కూడా స్టైల్‌తో చంపేసాడు సుధీర్. ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేసారు. పండగ పండగ కి ఎదో ఒక ఈవెంట్ చేసి  ప్రేక్షకులను ఆకట్టుకుంటారు  ఈ టీవీ వాళ్ళు.  ఈవెంట్‌పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా జీ తెలుగులో నాగబాబు మెయిన్ రోల్‌లో బాబుగారింట్లో బుట్టభోజనం ఈవెంట్ చేస్తున్నారు. దానికి తీసిపోకుండా ఈ వేడుక చేస్తున్నారు మల్లెమాల టీం. సుధీర్‌తో పాటు శ్రీముఖి, రోజా లాంటి చాలా మంది ఇందులో ఉన్నారు. హైపర్ ఆది కూడా ఇందులో డాన్సులతో పాటు పాటలు కూడా పాడి అలరించాడు. మొత్తానికి తన డాన్సులతో బాలయ్య ఫ్యాన్స్‌కు కమ్మని గిఫ్ట్ ఇచ్చాడు సుడిగాలి సుధీర్.బాలయ్య మజాకా అనేలా సుధీర్ ఇరగదీసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: