ఈ మ‌ధ్య కాలంలో కొంత మంది న‌టుల‌కు క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఇష్ట‌మొచ్చిన‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తున్నారు. గ‌తంలో శ్రీ‌రెడ్డి ఫిల్మ్ ఛాంబ‌ర్ చేసిన అర్ధ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న గురించి అంద‌రికీ తెలిసిందే. అదే త‌ర‌హాలో త‌మిళ న‌టి ఎలాకియా కూడా ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడ‌టం మొద‌లు పెట్టింది. కొంత మంది త‌మిళ ద‌ర్శ‌కుల మీద సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తోంది. అయితే ఈ భామ ఇటీవ‌లె ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌ను మొద‌లు పెట్టింది. అందులో మాట్లాడుతూ... నాకు అవ‌కాశాలు ఇస్తాన‌ని చెప్పి చాలా మంది ద‌ర్శ‌కులు న‌న్ను వాడుకున్నారంటూ  నిర్మొహ‌మాటంగా ఆరోపిస్తుంది. 

 

ఎలాకియా కొన్ని త‌మిళ చిత్రాల్లో చిన్న చిన్న పాత్ర‌ల్లో న‌టించింది. అయితే త‌న‌కు మంచి అవ‌కాశాలు ఇస్తామంటూ న‌మ్మించి ఆమెను మోసం చేశార‌ని మాతో శృంగారంలో పాల్గొంటేనే అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌న్నార‌ని ఆమె చెబుతోంది. వాళ్ళ‌ను న‌మ్మి ఘోరాతి ఘోరంగా మోస‌పోయానంటూ వాపోయింది. కొత్త‌గా ఎవ‌రైనా ఇండ‌స్ట్రీకి వ‌చ్చేముందు ఆలోచించుకుని రావాల‌ని త‌న లాగా మోస‌పోకూడ‌దంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది. అయితే ఈ మ‌ధ్య కాలంలో ఇలాంటివి చాలా ఎక్కువ‌యిపోయాయంటూ చాలా మంది సోష‌ల్ మీడియాలో మండిప‌డుతున్నారు. 

 

ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఇదొక ఫ్యాష‌న్‌లాగా త‌యార‌యిందంటూ చాలా మంది మండిప‌డుతున్నారు. ఇండ‌స్ట్రీకి వ‌చ్చే ముందు వాళ్ళ‌కు తెలియ‌దా. అవ‌కాశాలు ఇస్తారో లేదో తెలియ‌నంత‌లా ప్ర‌వ‌ర్తిస్తున్నారా అంటూ కొంత మంది అంటున్నారు. అంతేకాక ఈమె త‌న హాట్ ఫొటోస్‌ని వ‌ల్గ‌ర్ ఫోజుల‌తో డ‌బుల్ మీనింగ్ డైలాగుల‌తో సోష‌ల్ మీడియా అంతా వేడెక్కించేస్తోంది. అయితే దీనికి చాలా మంది నెటిజ‌న్లు ఈమె ప్ర‌వ‌ర్త‌న పై మండిప‌డుతున్నారు. ఇలాంటి వారు అస‌లు ఇండ‌స్ట్రీలో ఎలా అడుగుపెడ‌తారు. అలాగే ఒక ఆడ‌పిల్ల సినిమాల్లోకి ఎంట‌ర్ అవుతుంది అంటే అక్క‌డ ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తుంది. ఎలా ఉంటుంది అన్న‌ది తెలియ‌కుండానే ఉంటారా లాంటి కామెంట్లు వినిపిస్తున్నాయి. మ‌రి దీని పై ఇండ‌స్ట్రీ పెద్ద‌లు పూనుకుని కొన్ని క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటే బావుంటుంద‌ని చాలా మంది భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: