ప్రభాస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఫ్రాంఛైజీ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. దేశవ్యాప్తంగా ప్రభాస్ సినిమాకోసం జనాలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ క్రేజ్ రావడంతో ప్రభాస్ తో చేసే సినిమాలు భారీ బడ్జెట్ లోనే ఉంటున్నాయి. అందులో భాగంగానే ప్రభాస్ సాహో చేశాడు. అయితే ఈ సినిమా ప్రభాస్ కి గట్టి షాకిచ్చింది. అన్ని భాషల్లోను అనుకున్నంతగా వసూళ్ళు రాబట్టలేక లాస్ సినిమాగా మిగిలింది. అయినా ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆ క్రేజ్ తోనే సాహో సినిమా తర్వాత ప్రభాస్ - జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నాడు. విదేశాలలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందనుంది. అయితే సాహో ఎఫెక్ట్ తో ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ ని తగ్గించారు. సాహో స్థాయిలో అనుకున్న ఈ సినిమా చాలా బడ్జెట్ ని తగ్గించేశారు.

 

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్.. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో సినిమా చేయబోతున్నాడు. ఈ సంవత్సరం డిసెంబర్ లో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ ఇప్పటి వరకు నటించని ఒక కొత్త పాత్రలో కనిపించనున్నాడట. సైన్స్ ఫిక్షన్ జానర్ కాబట్టి గ్రాఫిక్స్ వర్క్ భారీ స్థాయిలో ఉండనుందని సమాచారం. అందుకే విఎఫ్ ఎక్స్ కోసం నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ ని కేటాయించారట.

 

డైరెక్టర్ నాగ్ అశ్విన్ కేవలం విఎఫ్ ఎక్స్ కోసమే 50 నుండి 60 కోట్లు కావాల్సి వస్తుందని బడ్జెట్ ఇచ్చాడట. అయితే మహానటి కోసం నాగ్ అశ్విన్ ఇంతగా ఖర్చు పెట్టించింది లేదు. కాని ప్రభాస్ కాబట్టి పాన్ ఇండియా సినిమా అని ఈ రేంజ్ లో బడ్జెట్ ని పెట్టిస్తున్నాడని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నరు. అయితే ఇప్పటికే సాహో తో ప్రభాస్ కి ఒక అనుభవం ఎదురైంది కాబట్టి అది మైండ్ లో పెట్టుకొని దర్శకుడు బడ్జెట్ చెప్పినప్పటికి దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత తీసుకుంటే బావుంటుందని సలహా ఇస్తున్నారట. వాస్తవంగా చెప్పాలంటే ఈ సలహా సరైనదే. మరి ప్రభాస్ దీన్ని పాటిస్తాడా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: