బాలయ్య అంటేనే మాస్ అంటారు. ఆయన్ని చూస్తే మాస్ ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోతారు. బాలయ్య సైతం తన కెరీర్ మొత్తం మీత అతి తక్కువ క్లాసిక్స్ చేశారు. ఆయన మాస్ కే అలా మొత్తానికి కట్టుబడిపోయారు. దాని కోసం ఎంత రిస్క్ అయినా చేస్తూ వచ్చారు. ఇక డైరెక్ట‌ర్లు కూడా బాలయ్యను మాస్ మూసలో బిగించేసి  భారీ హిట్లు కొట్టారు.

 

ఇక బాలయ్య బోయపాటి కాంబో అంటేనే వూర మాస్. వీర మాస్. ఫ్యాన్స్ కి ఒక్క లెక్కన పూనకం వచ్చేస్తుంది. హ్యాట్రిక్  మూవీ ఇపుడు సెట్స్ మీద ఉంది. ఈ మూవీలో హీరోయిన్ల కోసం జాతీయ స్థాయిలో  వేట చేసినా బోయపాటి సరైన రిజల్ట్ రాబట్టలేకపోయాడు. దాంతో రొటీన్ గా  శ్రియ, అంజలి మాత్ర‌మే ఫిక్స్ అయ్యారని ఫ్యాన్స్ కూడా దిగాలుపడ్డారు.

 

అయితే ఇపుడు వారికి కో గుడ్ న్యూస్ బాలయ్య బోయపాటి టీం చెబుతోంది. ఈ మూవీలో కొత్తగా హీరోయిన్ గా రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ని సెలెక్ట్ చేశారట. పాయల్ అంటేనే మసలాకే కేరాఫ్. ఆమె ఆర్డీఎక్స్ పేరిట మొదటి మూవీలోనే అందాలను ఆరేసి కుర్రకారుని ఉతికేసింది. 

 

ఆమె బ్యూటీని బయటేయడమే నా డ్యూటీ అంటుంది. ఆమె వరసగా చేసిన సినిమాలు ఫెయిల్ కావచ్చు కానీ పాయల్ అందాలు మాత్రం జలపాతాలేనని ఆడియన్స్ గుట్టు పట్టేశారు. దాంతో ఆమెకంటూ పక్కా రొమాంటిక్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఈ నేపధ్యంలో పాయల్ బాలయ్యతో ఆడి పాడడానికి రెడీ అయిందంటే మోతెక్కిపోవడం ఖాయమని అంతా లెక్కలేస్తున్నారు.

 

ఇప్పటివరకూ ఈ హ్యాట్రిక్ మూవీకి సరైన పాజిటివ్  బజ్ రాలేదు కానీ ఎపుడైతే పాయల్ జత కడుతోందని టాక్ రావడంతో ఒక్కసారిగా బాలయ్య ఫ్యాన్స్ లో హుషార్ పెరిగిందిట. ఈ  మూవీలో సాంగ్స్ అదరహో అన్నట్లుగా ఉంటాయని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే లేట్ గా అయినా లేటెస్ట్ బ్యూటేనే బాలయ్య పట్టేశాడని, సింహ, లెజెండ్ మూవీ మాదిరిగానే ఇది కూడా సూపర్ హిట్ కొట్టడం డ్యాం ష్యూర్ అని బాలయ్య ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారంట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: