మీడియా తో పాటు జనాలు ఇప్పటి వరకి స్వీట్ హీరోయిన్ అనుష్క కి ఎన్ని సార్లు పెళ్ళి చేశారో లెక్కేలేదు. ఎప్పటికప్పుడు అనుష్క తన పెళ్ళి విషయంలో క్లారిటీ ఇచ్చినప్పటికి మీడియావాళ్ళు ఊరుకోవడం లేదు. దాంతో అనుష్క ఈ పుకార్లు విని విని చిరాకు వచ్చి ఈ విషయంలో క్లారిటి ఇచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్ళి కాకుండా మిగిలి ఉన్న హీరో హీరోయిన్స్ లో అనుష్క, ప్రభాస్ అని అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరు కలిసి సినిమాలు చెసినప్పటి నుంచి ప్రభాస్ అనుష్క ప్రేమించుకుంటున్నారని త్వరలో పెళ్లి కి రెడి అవుతున్నారని 3-4 సంవత్సరాల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎంతకీ ఆ వార్తలు ఆగడం లేదు. ఇప్పటి వరకు అటు ప్రభాస్ గాని ఇటు అనుష్క గాని ఖచ్చితంగా తేల్చి చెప్పింది లేదు. 

 

అయితే రీసెంట్ గా ఈ విషయంలో అనుష్క పక్కాగా క్లారిటి ఇచ్చింది. నేను ప్రభాస్ కేవలం ఫ్రెండ్స్ మాత్రమే .. అంతకు మించి మా మధ్య ఏమి లేదు మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారని వెల్లడించింది. దాంతో అనుష్క ఇటీవలే ఒక వ్యాపారవేత్త కుమారుడిని పెళ్లిచేసుకోనుందని మళ్ళీ పుకార్లు మొదలయ్యాయి. అది కూడా నిజం కాదు అని తేలేసరికి..ఇండియన్ క్రికెటర్ ని త్వరలో పెళ్ళి చేసుకోబుతున్న అనుష్క అంటూ ఓ వారం పది రోజులు న్యూస్ బాగా వైరల్ అయింది. ఈ న్యూస్ కూడా గాసిప్ అని తేలిపోయింది. 

 

అయినా మన వాళ్ళు అంతటితో ఆగకుండా ఈ సారి ఒక డైరెక్టర్ తో ముడి వేసి రాశేశారు. ఇండస్ట్రీలోనే ఒక స్టార్ డైరెక్టర్ కొడుకుని పెళ్ళి చేసుకుంటుందని ప్రచారం జరిగింది. అయితే ఆ ఫేమస్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారే ఆయన కొడుకు ప్రకాష్ ని అనుష్క పెళ్లి చేసుకోబోయేది అని సోషల్ మీడియాలో మళ్ళీ న్యూస్ వైరల్ అయింది. అయితే అనుష్క ఈ విషయం పై స్పందించి ప్రకాష్ తో నా పెళ్లి అనేది కూడా పుకారు మాత్రమే .. ఇందులో ఎంతమాత్రం నిజం లేదు ..ఇదే కాదు ఇప్పటి వరకు నా పెళ్ళి విషయంలో వచ్చిన వాత్రలన్ని ఒట్టి పుకార్లేనని తేల్చి పారేసింది. నా పెళ్ళి ఫిక్సైతే అందరికి స్వయంగా నేనే చెబుతా .. అప్పటి వరకు ఇలా ఇష్టమొచ్చినట్టు వార్తలు రాయకండి అంటూ వెల్లడించింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: