లేడీ క‌మెడియ‌న్లు చెప్ప‌డానికి ఎంతో సింపుల్‌గా ఉన్న‌ప్ప‌టికీ. సినిమాల్లో వీళ్ళ ప్రాముఖ్య‌త మాత్రం చాలా ప్ర‌ధ‌మ‌మైన‌ది. రేలంగి, ర‌మాప్ర‌భ‌, కోవేశ‌ర‌ళ‌, బ్ర‌హ్మానందం ఇలా కామెడీ పండించాలంటేక లేడీ క‌మెడియ‌న్స్ పాత్ర ఎంతో మంచి టైమింగ్ డైలాగ్ డెలివ‌రీ చాలా బాడీల్యాంగ్వేజ్ చాలా ముఖ్యం. అలా టాలీవుడ్‌లోనే సూరేఖాంతం నుంచి నేటి క‌మెడియ‌న్ గీతాసింఘ వ‌ర‌కు పేరుగాంచిన క‌మిడియ‌న్లు ఎంతో మంది ఉన్నారు. అయితే వీరు క‌మెడిన్లుగా మాత్ర‌మే మ‌న‌కు తెలుసు. బ‌య‌టి ప్ర‌పంచం వ‌ర‌కు వీరు న‌వ్వులు పండించే వీళ్ళ గురించి మ‌న‌కు తెలియ‌ని ఎన్నో విషాద‌గాధ‌లు ఉన్నాయి. కొంత మంది జీవితాల్ని ఎంతో గ‌డిస్తున్నా పెళ్ళి పిల్ల‌లు వివాహం లాంటివి ఏమీ లేకుండా అలా ఒంట‌రిగా గ‌డిపేస్తున్న‌వారి గురించి చూద్దాం...

 

ఈ లిస్టులో మొద‌టిగా కోవైశ‌ర‌ళ గురించి తీసుకుంటే బ్రహ్మానందంతో త‌ను చేసిన కాంబినేష‌న్ ప్ర‌తిది సూప‌ర్‌డూప‌ర్ హిట్ అనే చెప్పాలి. 1990నుంచి బాగా పాపుల‌ర్ అయిన కోవైశ‌ర‌ళ కుటుంబం కోసం పెళ్లి చేసుకోలేదు. త‌న తోడ‌బుట్టిన‌వాళ్ళ‌కి ఒక లైఫ్ చూపించ‌డం కోసం మొద‌టి నుంచి క‌ష్ట‌ప‌డుతూ అంద‌రికి ఒక దారిని చూపించింది. కాని తాను మాత్రం వివాహం చేసుకోకుండా ఒంట‌రిగా ఉంటోంది. మొన్న ఈ మ‌ధ్య‌నే కొంత ఆనారోగ్యంతో ఆసుప‌త్రిలో జాయిన్ అయితే చూసే దిక్కులేక బోరున విల‌పించింది.

 

ఇక మ‌రో హాస్య‌న‌టి శ్రీ‌ల‌క్షి పేరుకే అమ‌ర్‌నాధ్ కూతురు అయితే పూట‌గ‌డ‌వ‌డం కోసం సినిమాల్లో చేరింది. కాస్త కుదుట ప‌డుతున్న క్ర‌మంలో తండ్రి త‌ర్వాత ముగ్గురు తోబుట్టువుల‌ను ఒక్కొక్క‌రిగా కోల్పోతుండ‌డంతో గుండెనిబ్బ‌రంతో కుటుంబాన్ని సాకింది. సోద‌రుడు రాజేష్ హీరోగా నిల‌దొక్కుకునే స‌మయంలో చ‌నిపోవ‌డంతో క‌న్నీరు బ‌య‌ట ప‌డ‌కుండా శ్రీ‌ల‌క్ష్మి షూటింగ్ పూర్తి చేసి ఇంటివి వెళ్ళి గుండె ప‌గిలేలా రోధించింది. తాను మాత్రం అంద‌రి బాధ్య‌త‌ల‌ను తీర్చిదిద్ది పెళ్ళిలేకుండా ఒంట‌రిగా జీవిస్తోంది.

 

నేటి క‌మెడియ‌న్ గీతాసింఘ్ ప‌రిస్థితి కూడా అంతే సినిమాల్లోకి వ‌చ్చే కాస్త నిల‌దొక్కుకునే స‌మ‌యంలో తొడ‌బుట్టిన ఒక్క‌గానొక్క త‌మ్ముడు చ‌నిపోయాడు. హాస్యం పండించ‌డం అల‌వాటైంది కాబ‌ట్టి మీడియా ముందు న‌వ్వుతూ ఉంటుంది కానీ త‌న జీవితంలో ఎంతో ఎదురీత ఉంది. పెళ్ళి చేసుకోకుండా త‌న సోద‌రుడి కుటుంబాన్ని అన్ని తానే చూసుకుంటుంది. పిల్ల‌ల‌కు తండ్రి లేని లోటు తీరుస్తుంది. అలాగే ఇటీవ‌లె చిట్టీలు వేసుకుని దాచుకున్న డ‌బ్బులు కూడా కోల్పోయి పోలీస్‌స్టేష‌న్ మెట్లు ఎక్కింది. పైసా పైసా కూడ‌బెడితే అవికూడా పోయాయంటూ క‌న్నీళ్ళు పెట్టుకుంది. వారి న‌వ్వుల వెనుక క‌నిపించ‌ని వారి అంత‌రంగ‌ముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: