మెగా బ్రదర్ నాగ బాబు ఎప్పుడు మాట్లాడినా దాపరికం లేకుండా డొంక దిరుగుడు వ్యవహారంలా కాకుండా సూటిగా సుత్తిలేకుండా చెప్పేస్తారు. ఎవరిని పొగడాలన్నా ఎవరిని తిట్టాలన్న మొహం మీద కొట్టినట్టే మాట్లాడతారు. సాధారణంగా సినిమా వాళ్ళలో ఈ నైజం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇదే నైజం దర్శకరత్న దాసరి నారాయణ రావుగారికి ఉంటుంది, దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా కి ఉంటుంది, మంచు మోహన్ బాబు కి ఉంటుంది. అందుకే ఒక్క దాసరి గారు తప్ప మిగతా వాళ్ళందరూ ఏ చిన్న విషయం మాట్లాడినా అందరూ బూతద్దంలో పెట్టి చూస్తారు. ముఖ్యంగా నాగ బాబు ఈ మధ్య ఏ విషయంలో స్పందించినా వాటిని కావాలని కెలికి కామెంట్ చేసేవాళ్ళు ఎక్కువవుతున్నారు. కాని వీటిని నాగబాబు మాత్రం అసలు పట్టించుకోరు.

  

నిజంగా బాబు గారు ముక్కోపి, అనవసరంగా నోరుపారేసుకునే వ్యక్తే అయితే ఇంతకాలం జబర్దస్త్ షో కి జడ్జ్ గా వ్యవహరించరు. షోలో అందరిని ఒక తాటిపైకి తీసుకు వచ్చి దాదాపు 8 ఏళ్ళుగా విజయవంతంగా ముందుకు నడిపించారు. అంతేకాదు ఈ షో లో పార్టిసిపెంట్స్ అందరికి బాబు గారు తన ఇంటి నుంచి భోజనం తెప్పించి పెట్టడం లోనే ఆయన మనుషులని ఎంతగా ప్రేమిస్తారో అర్థం చేసుకోవచ్చు. అయితే రీసెంట్ గా ఆయన కరోనా వైరస్ విషయంలో చేసిన వ్యాఖ్యలని తప్పుబట్టడానికి మళ్ళీ తయారయ్యారు.

 

కరోనా భయంతో ప్రపంచం మొత్తం వణికిపోతుంది. కరోనాకు ఇంకా మందు కూడా కనిపెట్టలేదు అని ప్రజలు వాపోతున్నారు. జనాలు బయట పనులకు పోలేక ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులు రోజువారి కూలిపని చేసి జీవనం సాగించే వాళ్ళతో సహా మొత్తం జనాభా ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో కొందరు సెలబ్రిటీలు ఇంట్లో కూర్చొని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

 

రీసెంట్ గా నాగబాబు కరోనా పై స్పందించారు. "కరోనా వైరస్ ను అరికట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవద్దంటూ తెలిపారు. ఇంకా ప్రజలు కూడా మా దేవుడంటే మా దేవుడే గొప్ప అనే చాదస్తపు మాటలు వాదనలు మానుకొని సైలెంట్ గా సైంటిస్టులు కనుక్కునే మందు కోసం ఎదురుచూడండి. దేవుళ్ళ ప్రతినిధులే ఏం పీకలేక మూసుకొని కూర్చున్నారు" అంటూ కామెంట్స్ చేశారు.

 

అయితే నాగబాబు చేసిన ఈ కామెంట్స్ సూటిగా ఉన్నప్పటికి అందులో వాస్తవం ఉంది అంటున్నారు కొంతమంది. కాని కొంతమంది మాత్రం ఆయన కామెంట్స్ ని ఎప్పటిలాగే తప్పు పడుతున్నారు. ఇంట్లో కూర్చొని మాట్లాడేవాళ్ళకి ఏం తెలుస్తుందంటూ ట్రోల్ చేస్తున్నారు. కాని ఈ విషయం లో మెగా ఫ్యాన్స్ మాత్రం బాబు గారు అన్నదాంట్లో తప్పేముందో అర్థం కావటం లేదు. ముక్కుసూటిగా మాట్లాడితే ఒక్కొక్కడికి మండుద్దెందుకో అంటూ ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: