ఎన్ని మారినా టాలీవుడ్‌లో మెయిన్ లీడ్‌లో యాక్ట్ చేసే యాక్ట‌ర్స్ వైపు మాత్రం ఇంకా  చిన్న చూపు చూసే స్థితిలోనే ఉంది. ఎప్పుడో ఎక్క‌డో ఏదో ఒక సినిమాలో ఒక హీరోయిన్ క్యారెక్ట‌ర్ క‌న‌ప‌డుతుంది అంతే. ఇక మిగ‌తా మూవీస్‌లో మాత్రం కేవ‌లం హీరోల కోసం మ‌నిచేసే రోబోస్‌లా మాత్రం హీరోయిన్లు ఉంటారు. మ‌న ద‌రిద్రం ఏమిటంటే మ‌న సోగ్గాళ్ళు తెలుగు టాప్ ఫిల్మ్ మేక‌ర్స్ సినిమాల్లో కూడా ఇలానే ఉంటాయి క్యారెక్ట‌ర్స్‌. స‌మంతలాగా అంద‌రికి కుద‌ర‌దు. అటు గ్లామ‌ర్ రోల్స్ చేస్తూనే ఇటు ప‌ర్‌ఫార్మెన్స్ రోల్స్ చేసి త‌ర్వాత త‌న‌కు న‌చ్చ‌న‌ట్టు క్యారెక్ట‌ర్స్ చేసే స్థాయి అంద‌రికి రాదు. ఇక్క‌డ లిస్ట్‌లో ఉన్న యాక్ట‌ర్స్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్‌కి ఇచ్చిన రెస్‌పెక్ట్ అయినా క్యారెక్ట‌ర్స్ రాయ‌డానికి ఎందుకు ట్రై చెయ్య‌రు మ‌న తెలుగు మేకర్స్ అన్న‌ది అర్ధం కాని ప‌రిస్థితి అలా హీరోయిన్ క్యారెక్ట‌ర్స్‌ని అండ‌ర్ ఎస్టిమేట్ చేసి ఇప్పుడు అస‌లు ఎవ్వ‌రూ అవ‌కాశాలు కూడా ఇవ్వ‌ని అలాంటి హీరోయిన్స్ ఎవ‌రో తెలుసుకుందాం...

 

మొద‌ట‌గా షాలిని పాండే అంద‌రూ అర్జున్‌రెడ్డిలోని విజ‌య‌దేవ‌ర‌కొండ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటాం. ఇక ఆ చిత్రంలో విజ‌య‌దేవ‌ర‌కొండలాగా ఎవ్వ‌రైనా న‌టించ‌గ‌ల‌రు. కాని ఆ చిత్రంలో షాలినిలాగా ఎవ్వ‌రూ న‌టించ‌లేరు. లిట్ర‌ల్‌గా క‌బీర్‌సింగ్ చూసిన వారికి షాహిద్‌క‌పూర్ కియారాని హెరాస్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. కానీ అర్జున్‌రెడ్డి చూసిన‌ప్పుడు మాత్రం ఒక చిన్న పిల్లాడు ఆవేశంలో పిచ్చిప‌నులు చేస్తుంటే ఒక త‌ల్లిలాగా ఆ బిడ్డ‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకుని ఓదారుస్తున్న‌ట్లు ఉంటుంది ఆ క్యారెక్ట‌ర్‌. షాలిని పాండే ప్రీతి పెర్‌ఫార్మెన్స్‌తోనే ప్రీతి క్యారెక్ట‌ర్ ఎలివేట్ అయింది. ఇక ఈ సినిమాకి సంబంధించి షాలినీకి ఒక్క అవార్డు కూడా రాలేదు. త‌ర్వాత త‌ను చేసిన చిత్రాలు త‌క్కువే అయినా ఎన్ని మంచి పాత్ర‌లు ఉన్నాయి. ఇక షాలినికి ఇకముందైనా మంచిపాత్ర‌లు వ‌స్తాయా అంటే క‌ష్ట‌మ‌నే చెప్పాలి. 

 

మ‌రో హీరోయిన్ శోభిత ధూళిపాళ తెలుగమ్మాయిల‌ను హీరోయిన్స్‌గా పెట్టుకోవాలంటే తెలుగువారు ఎవ్వ‌రూ ముందుకు రావ‌డం లేద‌ని చెప్పే ద‌ర్శ‌కుల మాట‌లు అటు ఉంచితే...కాని వ‌చ్చిన‌వారిలో వీరు ఎంత మందికి ఛాన్సులు ఇస్తున్నారు. శోభిత ధూళిపాళ అచ్చ‌తెలుగు వైజాగ్ అమ్మాయి. ఇక త‌న యాక్టింగ్ గురించి మాట్లాడేంత సీన్ మ‌న‌కెవ్వ‌రికి లేదు కూడా. ఒక్క‌సారి అమెజాన్ వెళ్ళి త‌న వెబ్‌సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ చూస్తే అర్ధ‌మ‌వుతుంది. త‌న యాక్టింగ్ క్యాప‌బులిటీ ఏమిట‌న్న‌ది. అందం అభిన‌యం నిండైన క్యాప‌బులిటీ ఉన్న హీరోయిన్ శోభిత‌. గూఢాచారిలో యాక్ట్ చేసిన‌ప్ప‌టికీ ఇక్క‌డ మంచి అవ‌కాశాలు రావ‌డం లేదు. ఇక హిందీలో ట్రై చేస్తోంది. అక్క‌డ ఈమెకు అద్భుత‌మైన పాత్ర‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికైనా తెలుగువాళ్ళ‌ణు గుర్తించాల‌ని కోరుకుందాం. 

 

త‌ర్వాత రీతూ వ‌ర్మ తెలంగాణ అమ్మాయి రీతూ. అప్ప‌ట్లో భూమిక‌కు ఖుషి మూవీ టైమ్‌లో ఎలాంటి పాత్ర‌లు వ‌చ్చాయో అలాంటి రీతూకి ఎందుకు రావ‌డం లేదో అర్ధం కావ‌డం లేదు. అలాంటి పాత్ర‌ల‌కి క‌రెక్ట్‌గా స‌రిపోతుంది. అస‌లు అలాంటి పాత్ర‌లు రాయ‌డం మానేశారా అనిపిస్తుంది. పెద్ద హీరోల సినిమాలంటే కేవ‌లం డ్యాన్స్‌ల‌కు త‌ప్పించి హీరోయిన్స్ ఇంకా ప‌నికిరారు క‌దా.

 

మ‌రో హీరోయిన్ శ్ర‌ద్ధాశ్రీ‌నాధ్ జెర్సీ మూవీలో చాలా మంచి పాత్రలో న‌టించింది. దానిత‌ర్వాత మ‌ళ్ళీ క‌నిపించ‌లేదు. ఒక‌వేళ క‌నిపిస్తుందా అంటే డ‌వుటే. ఒక‌వేళ క‌నిపిస్తే మంచి పాత్ర‌లో క‌నిపించే ఛాన్స్ ఉందా అంటే వేచిచూడాల్సిందే. మెహ్రీన్ ఫిర‌జాదా. మెహ్రీన్ అంటే హ‌నీ ఈజ్‌ద బెస్ట్ డైలాగ్ గుర్తు వ‌స్త‌ది. ఆమె ఎన్నో అద్భుత‌మైన పాత్ర‌ల్లో న‌టించింది. 

 

నిత్య‌మీన‌న్ త‌ను ఎంతో మంచి యాక్ట‌ర్ కానీ ఆమెకు కూడా పాత్ర‌లు రావ‌డం లేదు. అస‌లు నిత్య మీన‌ను తీసుకునే ఆలోచ‌న బ‌డా ఫిల్మిమేక‌ర్స్‌కి ఉంటుందా అంటే డ‌వుటే. ఇషారెబ్బా ప‌రిస్థితి క‌డా అంతే అవ‌కాశాలు లేక శోభిత లాగా హిందీలోకి వెళ్ళిపోయింది. సాయిప‌ల్ల‌వి, అదితిరావ్ హైద‌రీ దాదాపు వీళ్ళంద‌రి ప‌రిస్థితి అంతే... ఇక రితిక సింఘ్ గురు చిత్రంలో ఎంతో మంచి పెర్‌ఫార్మెన్స్ ఇచ్చింది. ఆ త‌ర్వాత ఒక లారెన్స్ చిత్రంలో న‌టించింది మ‌ళ్ళీ క‌నిపించ‌లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: