రాజకీయాల్లోకి వెళ్లి పోయాక పవన్ కళ్యాణ్ ని సిల్వర్ స్క్రీన్ పై చూసి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తోంది. చివరి సినిమా స్నేహితుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అజ్ఞాతవాసి' సినిమా చేయడం జరిగింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలకు పరిమితమై 2019 ఎన్నికలలో పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోవడం జరిగింది. దీంతో రాజకీయాలకు దగ్గర అయిన పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరం అవడం జరిగింది. ఆ టైంలో పవన్ కళ్యాణ్ ఓడిపోయిన సమయంలో తన పూర్తి జీవితం ప్రజాసేవకే అంటూ ప్రకటించి అభిమానులకు నిరాశ కలిగించారు. అయితే చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమా రంగంలో అడుగు పెట్టడం తో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అభిమానులలో వెయ్యి రెట్లు ఎనర్జీ ఫామ్ అయింది.

 

పవన్ కళ్యాణ్ తన రీ-ఎంట్రీ విషయంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ సినిమా 'పింక్' రీమేక్ ని సెలెక్ట్ చేసుకుని తెలుగులో 'వకీల్ షాబ్' టైటిల్ పేరిట విడుదల చేయటానికి రెడీ అయ్యారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని దిల్ రాజు మరియు బోనీకపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ ఈ మధ్యే రిలీజై అందరినీ ఆకట్టుకుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్ర బాధ్యతను డైరెక్టర్ క్రిష్ కు అప్పజెప్పాడు. పీరియాడికల్ ఈ చిత్రాన్ని బడా నిర్మాత ఏ.ఎమ్.రత్నం నిర్మిస్తున్నారు.

 

అయితే కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో నిర్మాతలు చిత్ర నిర్మాణాలను ఆపేసిన విషయం తెలిసిందే. దీని కారణంగా మే నెలలో విడుదల కావాల్సిన 'వకీల్ షాబ్' చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో ఇప్పుడిప్పుడే విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. సినిమా రిలీజ్ చేసి వరుసగా ప్రాజెక్టులు చేద్దామనుకున్న పవన్ కళ్యాణ్ కి కరోనా వైరస్ వల్ల నష్టం వచ్చినట్లయింది. దీంతో వకీల్ షాబ్' సినిమా పూర్తయిన తర్వాత మిగతా సినిమాలు చేయాలని అప్పటి దాక వెయిట్ చేయాలి అంటూ డైరెక్టర్లను మరియు ప్రొడ్యూసర్లని పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఈ పరిణామంతో చాలామంది ఇంతవరకూ పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేసే డైరెక్టర్లను మరియు నిర్మాతలను చూశాం. కానీ పరిస్థితి మారింది సిచువేషన్ డిమాండ్ చేస్తుంది పవన్ కళ్యాణ్ పరిస్థితి పాపం అన్నట్టుగా పెద్ద కష్టం కరోనా వైరస్ వల్ల వచ్చిందని తాజా పరిణామంపై కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: