‘నా పేరు సూర్య’ లాంటి దారుణమైన డిజాస్టర్ సినిమా తర్వాత దాదాపు ఏడాదిన్నర పైగానే సినిమాలకు దూరం అయిపోయాడు బన్నీ. ఇటువంటి టైం లో చాలా కథలు విన్నా అల్లు అర్జున్ తనకు రెండు మర్చిపోలేని బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పిన ‘అల వైకుంఠపురములో’ సినిమాకి ఓకే చెప్పి ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేసి అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నాన్ బాహుబలి రికార్డులను ఈ సినిమాతో పగలగొట్టడం జరిగింది. సంక్రాంతి పండుగకు రిలీజ్ అయిన అన్ని సినిమాల కంటే ‘అల వైకుంఠపురములో’ సినిమా అత్యధిక వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీ లో సంచలనం సృష్టించి నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో ఓ సినిమాను బన్నీ మొదలుపెట్టాడు.

 

ఇప్పటికే షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాను పూర్తి మాస్ ఎంటర్‌టైనర్‌గా సుక్కు తెరకెక్కిస్తున్నాడట.ఈ సినిమాను పక్కా ప్లానింగ్‌తో రూపొందించి సంక్రాంతి బరిలో దించాలని బన్నీ ప్లాన్ చేస్తున్నాడు. వచ్చే సంక్రాంతి టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా rrr రిలీజ్ కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి నటిస్తున్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయ్. అటువంటి ఈ సినిమాతో బన్నీ ఢీ కొట్టాలని చూస్తున్నాడు.

 

సుకుమార్‌తో కలిసి తీస్తున్న సినిమాపై పూర్తి నమ్మకం ఉండటంతో బన్నీ ఈ రిస్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఉండగా బన్నీ కోసం ఈ సినిమాలో అదిరిపోయే ఫైట్ ఒకటి సుకుమార్ తన మార్క్ డైరెక్షన్లో పెట్టినట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో చేయని విధంగా ఈ సినిమాలో ఆ ఫైట్ లో బన్నీ చాలా రిస్కులు చేయబోతున్నట్లు సినిమాకి ఆ ఫైట్ హైలెట్ కాబోతున్నట్లు...ఫిలింనగర్లో ఈ ఫైట్ గురించి చాలామంది మాట్లాడుతూ ఫైట్ సీన్ మామూలుగా ఉండదు బన్నీ కెరీర్ లోనే నిలిచిపోతుందని కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: