రెబల్ స్టార్ మరియు పాన్ ఇండియా హీరో ప్రభాస్ బాహుబలి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ సాధించిన తరువాత చాలా నేర్పుగా తర్వాత చిత్రాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. యువ దర్శకుడు సుజిత్ తో సాహో చిత్రం తీసిన ప్రభాస్ తన తరువాత చిత్రాన్ని కె.రాధాకృష్ణన్ దర్శకత్వంలో ఒక లవ్ స్టోరీతో ముందుకు రానున్నాడు. తర్వాత ప్రాజెక్టు ఒక సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్నాడు. ఇలా అద్భుత ప్రణాళికలో తన సినిమాలు ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్న ప్రభాస్ ఇప్పటికీ బ్యాచిలర్ అంటే ఎవరు నమ్మరు.

 

మరొక వైపు అదే బాహుబలి సినిమాలో దేవసేన పాత్రలో జీవించిన అనుష్క కి 30 ఏళ్ల వయసు దాటినా ఇంకా పెళ్లి కాలేదు. ప్రభాస్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులకు ప్రభాస్-అనుష్క పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఎప్పుడు అనుకుంటుంటారు. దీనిపై నేషనల్ మీడియా లో కూడా చర్చ జరిగినా ప్రభాస్ మరియు అనుష్క తాము మంచి స్నేహితులం మాత్రమే అని ఎప్పటికప్పుడు వాటిని కొట్టిపారేస్తూ ఉంటారు.

 

అయితే తాజాగా యాంకర్ సుమ యొక్క క్యాష్ ప్రోగ్రాం కి విచ్చేసిన అనుష్క కి సుమ ఒక క్లిష్టమైన ప్రశ్న వేసింది. రెండిటిలో మీరు ఏదైనా ఒకటి వదులుకోవాలి అని మొదటి ఆప్షన్ కింద 'ప్రభాస్ తో స్నేహం' మరియు రెండవ ఆప్షన్ కింద 'సినిమాలు' అని ఇచ్చింది. దానికి అనుష్క ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తాను ప్రభాస్ కోసం సినిమాలే వదులుకుంటానని ఖరాఖండిగా చెప్పేసింది. తను సినిమాల కోసం స్నేహాన్ని వదులుకునేంత మూర్ఖురాలను కానని అనుష్క తేల్చి చెప్పగా వెంటనే సుమా స్నేహం కోసం ప్రాణం అయిన పణంగా పెడతా అని చెప్పిన స్వీటీ అని ఆమెని ఆట పట్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: