మురళీమోహన్ ఫ్యామిలీ హీరోగా 1970 ప్రాంతంలో ఒక వెలుగు వెలిగాడు. ఒకానొక సమయంలో ఆనాటి టాప్ హీరోలు కృష్ణ కృష్ణంరాజు శోభన్ బాబు లతో సమానంగా అతడికి అవకాశాలు వస్తూ ఉండేవి. అయితే ఆ తరువాత ప్రేక్షకుల అభిరుచి మారిపోవడంతో పాటు చిరంజీవి హవా మొదలు కావడంతో మురళీ మోహన్ హీరోగా తన క్రేజ్ ను పోగొట్టుకున్నా వ్యాపార వేత్తగా రాజకీయ నాయకుడుగా టాప్ హీరోలతో సమానంగా తన స్థాయిని కొనసాగిస్తూ వచ్చాడు.

ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఇతడు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలనాటి టాప్ హీరోల గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ‘మనవూరి పాండవులు’ సినిమా షూటింగ్ సమయంలో ఒకరోజు కృష్ణంరాజు చిరంజీవిని చూసి తనతో మాట్లాడుతూ చిరంజీవి కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉందని అతడు టాప్ విలన్ గా రాణిస్తాడు అని అప్పట్లో కృష్ణంరాజు తనతో చెప్పిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు.


అయితే తాను మాత్రం చిరంజీవి టాప్ హీరో అవ్వడమే కాకుండా అందరికీ మొగుడవుతాడు అంటూ ఆనాడే తాను ఊహించాను అంటూ అప్పటి విషయాలను ఇప్పుడు బయటపెట్టాడు. ఇదే సందర్భంలో సూపర్ స్టార్ కృష్ణ గురించి మాట్లాడుతూ కాలేజీలో తనకు సీనియర్ అయిన కృష్ణను చూసి అతడు టాప్ హీరో అవుతాడు అని తనకు చాలసార్లు అనిపించిన విషయాలను కూడ చెప్పుకొచ్చాడు. 

ఇక ఎన్టీ రామారావుతో తన సాన్నిహిత్యం గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ ను చూస్తే ఎవరికైనా గౌరవంతో వెంటనే పాదనమస్కారం చేయాలి అనిపిస్తుందని అలాంటి వ్యక్తిత్వం ఉన్న ఒక వ్యక్తి ఇప్పట్లో సినిమా రంగంలో కాని రాజకీయ రంగంలో కాని రావడం కష్టం అంటూ ఎన్టీఆర్ తన అభిమానాన్ని ప్రదర్శించాడు. ఒకప్పుడు భారీ సినిమాలు తీసి నిర్మాతగా కూడ రాణించాలి అని ప్రయత్నాలు చేసిన మురళీమోహన్ మధ్యలో బుల్లితెర పై రాణించాలని ప్రయత్నించినా అక్కడ ఫెయిల్ అవ్వడం చాలామందికి ఆశ్చర్యం కలిగించే విషయం.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: