బిగ్ బాస్ తమిళ్ 3లో స్టార్ కంటెస్టెంట్ గా నిలిచినా మీరా మిదున్ మార్ఫింగ్ ఫోటోలు పోర్న్ సైట్స్ లో దర్శనమిచ్చాయట. స్వతహాగా మోడల్ కావడంతో కొద్దిగా అల్ట్రా మోడరన్ లుక్ లో కనిపించేది ఈ అమ్మడు. అంతేకాదు షోలో ఉన్నంత కాలం తన గ్లామర్ షోతో అదరగొట్టేది. బిగ్ బాస్ హౌజ్ లో 35 రోజులు ఉన్న మీరా మిథున్ ఎప్పుడు తన స్కిన్ షో చేస్తూ.. వివాదాలు సృష్టిస్తూ హడావిడి చేసింది. అయితే ఇదంతా కావాలనే ఆమె చేస్తుందని ఆడియెన్స్ కు అర్ధమైంది అందుకే 35 రోజులకే ఆమెను బయటకు పంపించారు. 

 

బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ తో కొన్ని క్రేజీ ఆఫర్స్ సొంతం చేసుకుంది. అయితే అంతా బాగానే ఉంది కానీ మీరా మిథున్ మార్ఫింగ్ ఫోటోలు కొన్ని బూతు సైట్లలో కనిపించాయట. ఎవరో కావాలని తన ఫోటోలు మార్ఫింగ్ చేసి వాటిలో పెట్టారని.. సైబర్ నేరగాళ్లు ఇలా రెచ్చిపోతుంటే తమిళనాడు పోలీసులు చూస్తూ ఏం చేస్తున్నారని ఫైర్ అవుతుంది అమ్మడు. పోర్న్ సైట్ లో తన ఫోటోలు అది కూడా పూర్తిగా మార్ఫింగ్ చేసిన పిక్స్ చూసి మీరా మిథున్ షాక్ కు గురైందని తెలుస్తుంది. 

 

దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకునేలా చర్యలు చేపడుతుందట. తనని డీఫేమ్ చేయడానికి ఇలాంటివి చేస్తున్నారని దీని వెనకాల ఎవరు ఉన్నా సరే వదిలిపెట్టేది లేదని ఆమె అంటుంది. కేవలం మీరా మిథున్ మాత్రమే కాదు సినిమా వాళ్ళవి కూడా ఇలా మార్ఫింగ్ చేసి పోర్న్ సైట్స్ లో పెట్టారు. కొందరికి ఇదే  పని అన్నట్టు చేస్తుంటారు. సరైన లీగల్ యాక్షన్ కు దిగితే మాత్రం తప్పకుండా అవి చేసింది ఎవరు.. ఎందుకు చేశారన్న విషయం బయట పడుతుంది. బిగ్ బాస్ లో తన క్రేజ్ చూసి కావాలనే కొందరు ఇలా చేశారని అంటుంది మీరా మిథున్. ప్రస్తుతం ఆమె మార్ఫింగ్ ఫోటోలు కనబడకుండా ఆయా యుఆర్.ఎల్స్ బ్లాక్ చేశారని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: