‘ప్రతిరోజు పండగే’ మూవీ ఊహించని విజయం సాధించి 40 కోట్లు కలక్షన్స్ కలెక్ట్ చేసిన టాప్ హీరోలు ఎవ్వరూ మారుతి వంక చూడలేదు. ప్రస్తుతం ప్రపంచాన్ని ఒణికిస్తున్న వైరస్ ప్రభావంతో ఇప్పుడు చాలామందికి మారుతి గుర్తుకు వస్తున్నాడు. 


మారుతి గతంలో దర్శకత్వం వహించిన ‘మహానుభావుడు’ మూవీలోని శర్వానంద్ పాత్ర లా ఇప్పుడు ప్రతివ్యక్తి మారిపోవడంతో మారుతి క్రియేట్ చేసిన శర్వానంద్ పాత్ర ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్’ లక్షణాలు ఇప్పుడు ప్రపంచంలోని అందరిలోనూ వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో మారుతి ‘మహానుభావుడు’ సినిమాను గుర్తుకు చేసుకుంటూ ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుతం ప్రపంచంలోని మనుషులంతా ‘మహానుభావులు’ గా మారిపోయారు అంటూ మారుతి కామెంట్ చేసాడు.


గతంలో తాను ‘మహానువుడు’ సినిమాలో శర్వానంద్ పాత్రను క్రియేట్ చేసినప్పుడు తాను ఆ పాత్రను చాల అతిగా చూపించానని చాలామంది కామెంట్ చేసిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ ఇప్పుడు తన కథలోని శర్వానంద్ పాత్ర లా కరోనా భయంతో చాలామంది కనిపిస్తున్నారు అంటూ జోక్ చేసాడు. అంతేకాదు ఎవరైనా తుమ్మితే దూరం జరిగిపోతూ హాస్పటల్ కు వెళ్ళితే మాస్క్ లు తగిలించుకుని రోజుకు అనేకసార్లు శానిటైజర్ స్ప్రేలు కొట్టుకుంటూ కనిపించిన శర్వానంద్ లా ఈరోజు ప్రతి వ్యక్తి మారిపోవలసిన పరిస్థితులు కరోనా దెబ్బతో ఏర్పడ్డాయి అంటూ మారుతి కామెంట్ చేసాడు.


ప్రస్థుతం ఇండస్ట్రీలో మాత్రమే కాదు ప్రపంచంలో ఎవరూ డబ్బు ఆస్థులు గురించి మాట్లాడుకోవడం లేదనీ ‘బ్రతికితే చాలు’ అన్న పరిస్థితులలో ప్రతి వ్యక్తికి డబ్బు పట్ల వ్యామోహం పోయేలా కరోనా వైరస్ అందరి మనసులను మార్చేసింది అంటూ మారుతి జోక్ చేసాడు. ఇదే సందర్భంలో ప్రస్తుతం తాను ఖాళీగా ఉండటంతో వ్రాస్తున్న ఒక కథ గురించి వివరిస్తూ ‘భలే భలే మగాడివోయ్’ లో నాని ‘మహానుభావుడు’ లోని శర్వానంద్కరోనా టైమ్ లో కలిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలతో ఒక కథ వ్రాస్తున్న విషయాన్ని వివరిస్తూ మారుతి తన సినిమాల కథగా కూడ కరోనాను వాడుకుంటున్న విషయాన్ని బయటపెట్టాడు..    

మరింత సమాచారం తెలుసుకోండి: