కరోనా వల్ల వచ్చిన విరామాన్ని మన టాలీవుడ్ హీరోలు కథలు వింటూ కాలం గడుపుతూ ఉంటే బాలీవుడ్ సెలెబ్రెటీలు మాత్రం తమలోని కళాత్మక నైపుణ్యాన్ని బయటకు తీస్తూ తమ సృజనాత్మకతను చాటుకుంటున్నారు. బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ ఒక మంచి చిత్రకారుడు అన్న విషయం మళ్ళీ అందరికీ తెలిసి వచ్చేలా ఈ కరోనా సహకరిస్తోంది. 


ప్రస్తుతం సల్మాన్ తన ఇంటికే పరిమితం అవుతూ బొగ్గును ఉపయోగించి ఆ బొమ్మలో ఒక పురుషుడు అదేవిధంగా ఒక మహిళ తమ ముఖాలను కరోనా భయంతో వస్త్రంతో కప్పుకుంటున్నట్లు గీసిన బొమ్మలు ప్రస్తుతం మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. ఇక హీరోయిన్ కత్రినా కైఫ్ అయితే తన స్వీయ గృహ నిర్భందంలో ఉంటూ గిటారు చేత పుచ్చుకుని సంగీత సాధన చేస్తూ తాను మరిచిపోయిన సంగీతాన్ని గుర్తుకు చేసుకుంటోంది.


ఇక క్రేజీ బ్యూటీ అలియా భట్ అయితే తన సోదరి షహీన్ తో కలిసి ప్రస్తుతం తన బుర్రకు పదును పెడుతూ ఒక గేమ్ డిజైన్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇక యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా అయితే తాను ఇప్పటికే వ్రాసిన అనేక కవితలను ఒక పుస్తకంగా తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. 


‘ఇప్పుడు ధనవంతులకు ప్రతిరోజు ఆదివారంగా ఉంది అయితే పేదవాడు మాత్రం పని ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తూ తనకు పని లేకుండా చేసిన కరోనా పై పగతో రగిలి పోతున్నాడు’ అంటూ భావ యుక్తంగా ఈ యంగ్ హీరో కవితలు రాస్తున్నాడు. అయితే మన హీరోలు మాత్రం ఈ విషయాలు ఏమి పట్టించుకోకుండా కేవలం ప్రజలను జాగ్రత్తగా ఉండమని సందేశాలు ఇచ్చి తాము మాత్రం గంటల తరబడి జిమ్ లో ఎక్స్ సైజ్ లు చేసుకుంటూ మధ్యలో దరసకులు చెపుతున్న కథలు వింటూ అదే తమ సామాజిక బాధ్యత అని భావిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: