తమిళ స్టార్ హీరో ధనుష్, వెట్రి మారన్ కాంబినేషన్‌లో రూపొందిన 'అసురన్' తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేసింది.  వి. క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మించిన ‘అసురన్’లో ధనుష్.. రాజదేవన్, కాళీగా ద్విపాత్రాభినయంలో నటించారు.  దసరా కానుకగా అక్టోబర్ 4న విడుదలైన ఈ  చిత్రం రూ.150 కోట్ల క్లబ్ లో చేరింది.  ధనుష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రం అని చెప్పొచ్చు.  ఇందులో ధనుష్ తన లుక్ పూర్తిగా మార్చిన విషయం తెలిసిందే.  తాజాగా ఈ చిత్రం రిమేక్ తెలుగులో చేస్తున్నారు.  శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'నారప్ప' చిత్రం రూపొందుతోంది.  ఈ చిత్రంలో ధనుష్ పాత్రలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నాడు.  ఈ చిత్రం విభిన్నమైన గెటప్ తో విలక్షణమైన బాడీ లాంగ్వేజ్ తో ఈ  చిత్రంలో వెంకటేశ్ కనిపించనున్నాడు.

 

ఈ చిత్రం మొదట దర్శకుడి విషయంలో ఎన్నో చర్చలు జరిగాయి.. మొత్తానికి శ్రీకాంత్ అడ్డాల చేతిలో పడింది.  ఆ మద్య వెంకటేష్, మహేష్ బాబు మల్టీస్టారర్ మూవీగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తో అద్భుతమైన విజయం అందుకున్నారు శ్రీకాంత్ అడ్డాల.  ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలో దారుణమైన డిజాస్టర్ పొందాడు.  కుటుంబ సంబంధాల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించలేక పోయింది.  ఆ తర్వాత చాలా గ్యాప్ తో విక్టరీ వెంకటేష్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు శ్రీకాంత్ అడ్డాల. 

 

ఈ చిత్రం ఆయన ఓ ఛాలెంజ్ గా తీసుకొని చేస్తున్నట్లు సమాచారం.  ఈ చిత్రం  సినిమా షూటింగ్ మొదలైంది .. ఇంతవరకూ 56 రోజుల పాటు చిత్రీకరణ జరిపారట. దీంతో 70 శాతం చిత్రీకరణ పూర్తయినట్టుగా చెబుతున్నారు.   పీటర్ హెయిన్స్ డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.  అయితే కేరళాలో షూటింగు జరుగుతుండగా కరోనా గురించిన వార్తలు తీవ్రతరం కావడంతో, నాలుగు రోజుల పాటు షూటింగు మిగిలి ఉండగానే ఈ చిత్ర టీమ్ వెనుదిరిగింది. ప్రస్తుతం అక్కడ కరోనా ఎఫెక్ట్ చాలా ఉన్న విషయం తెలిసిందే.  వెంకటేశ్ సరసన ప్రియమణి నటిస్తుండగా, మరో హీరోయిన్ గా రెబ్బా మోనికా జాన్ కనిపించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: