మరో రెండు రోజులలో 130 కోట్ల భారత ప్రజానీకం ఆదివారం ఉదయం 7 నుండి రాత్రి 9 గంటల వరకు పాటించబోతున్న స్వచ్చంద జనతాకర్ఫ్యూ తో భారత్ కరోనా పై చేస్తున్న పోరాటాన్ని ప్రపంచానికి తెలిసేలా చేస్తోంది. ప్రస్తుతం మన దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 190 కి దాటిపోయిన పరిస్థితులలో భారత దేశంలోని యావత్ ప్రజానీకం కంటికి నిద్ర తిండి కూడ లేని పరిస్థితులలో ఉంది.


చాలచోట్ల స్వయం ఉపాది చేసుకునే సుమారు 4 కోట్ల కుటుంబాలు కరోనా దెబ్బ తమ చిన్నచిన్న వ్యాపారాలు మూసుకునే స్థాయికి వస్తే భాగ్యనగరంలో ఉండే వేలాది క్యాబ్ డ్రైవర్లకు ఆటో డ్రైవర్లకు రోజు గడవని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి విపత్కర పరిస్థితులలో భారతదేశం చిన్నాభిన్నం అయిపోతోంది. 


ఈ పరిస్థితుల నుండి బయటపడటానికి ముందు జాగ్రత్త చర్యలుగా కరోనా వ్యాప్తిని నివారిస్తూ షూటింగ్ లు బంద్ అయిన పరిస్థితులలో ప్రస్తుతం ఈ సెగ బుల్లితెర కార్యక్రమాలకు కూడ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. సాధారణంగా బుల్లితెరలో ప్రసారం అయ్యే రియాలిటీ షోలు గేమ్ షోలు సీరియల్స్ కు సంబంధించి కేవలం రెండు వారాల వరకు ప్రసారానికి సరిపోయే విధంగా రికార్డింగ్ చేసుకుని ఉంటారు. 


అయితే ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి కెసిఆర్ షూటింగ్ లను ఈనెలాఖరి వరకు బ్యాన్ చేయడంతో ప్రస్తుతం బుల్లితెర పై జనం ఎక్కువగా చూసే ‘జబర్దస్త్’ ‘అదిరింది’ ‘ఢి’ లాంటి షోలతో పాటు అనేక సీరియల్స్ కు సంబంధించిన కంటెంట్ ఇక కేవలం వారం రోజులు మాత్రమే సరిపడే విధంగా ఆ కార్యక్రమ నిర్వాహకుల దగ్గర ఉందని ఆ తరువాత కూడ ఇదే పరిస్థితి కొనసాగితే బుల్లితెర పై చూడటానికి కేవలం రిపీట్ ప్రోగ్రామ్ లు మినహా మరే కార్యక్రమాలు కనిపించవు అంటూ ఇప్పుడు బుల్లితెర వర్గాలు ఇస్తున్న లీకులతో అటు సినిమాలు లేక ఇటు బుల్లితెర కార్యక్రమాలు లేక వినోదం కోరుకునే బుల్లితెర చూసే ప్రేక్షకుల పరిస్థితి ఏమిటి అంటూ అయోమయ పరిస్థితులలో పడిపోయింది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: