ప్రపంచ మహమ్మారి కరోనా 177 దేశాలకు విస్తరించింది.. ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా భయం పట్టుకుంది. ఇప్పటి వరకు ఏ వైరస్ కూడా ఇంతగా మనుషులపై వారి మనోభావాలపై ప్రభావం చూపించలేదు. ఓ వైపు ఆర్థిక వ్యవస్థ.. మరోవైపు ప్రాణాలపై ఈ కరోనా మహమ్మారి ప్రభావం చూపిస్తుంది.  ఎంతగా అంటే మనిషిని చూసి మనిషే భయపడే పరిస్థితి ఏర్పడింది.  ఇక కరోనా ఉందని తెలిస్తే ఆ వ్యక్తి మహా పాపం చేసినవాడిలా చూస్తున్నారు.  దేశంలో ఇప్పటివరకు కరోనా వైరస్ బాధితుల సంఖ్య 195కు చేరింది. దేశంలో కరోనా వల్ల ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు.   కరోనా బాధితులు అధికంగా ఉన్న మహారాష్ట్రలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని తేలిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ ప్రకటించారు.

 

దీంతో ఆ రాష్ట్రంలో కరోనా కేసులు 52కి చేరాయి.  తెలంగాణ లో కరోనా బాధిన పడ్డారు విదేశీయులు అని అంటున్నారు. ఇప్పటికే కరోనా లక్షణాలు ఉన్న వారిని గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ ని అరికట్టేందుకు ఇప్పటి వరకు ఎంతో మంది సెలబ్రెటీలు తమదైన స్టైల్లో సోషల్ మీడియాలో సందేశాలు ఇస్తున్నారు.  ఇప్పటి వరకు చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు మరికొంత మంది బుల్లితెర నటులు  కరోనా రాకుండా ఎలా ఉండాలి.. ఏం చేయాలని అన్న సందేశాలు వీడియో షూట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ ఓ వీడియోని సోషల్ మాద్యమంలో పోస్ట్ చేశారు.

 

కరోనా వైరస్‌ బారిన పడకుండా ముమ్మర ప్రయత్నాలు చేస్తోన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇందులో భాగంగా 'సేఫ్‌ హ్యాండ్స్‌ ఛాలెంజ్‌' పేరిట చేతులను శుభ్రం చేసుకునే విధానంపై విస్తృత ప్రచారం కల్పిస్తోన్న విషయం తెలిసిందే.  తాజాగా కొవిడ్‌-19 బారిన పడకుండా ఉండేందుకు చేతులను శుభ్రంగా కడుక్కోవడం చాలా చక్కటి మార్గం. 20 నుంచి 40 క్షణాల పాటు చేతులు కడుక్కోవడానికి సమయాన్ని వినియోగించి సూక్ష్మజీవులను నాశనం చేయొచ్చు. అందరం కలిసి కరోనాను తరిమికొడదాం' అని ఆమె సందేశం ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: