ఈ మ‌ధ్య కాలంలో బుల్లి తెర పైన చేసే షోస్ మాములు హంగామా చెయ్య‌డంలేదు. ఇక ఒక‌రి షోకంటే మ‌రొక‌రి షో టిఆర్పీ రేటింగ్‌ల కోసం తెగ క‌ష్ట‌ప‌డిపోతున్నారు. యాంక‌ర్లు జ‌డ్జిలు. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త షోల‌తో మ‌న ముందుకు వ‌స్తున్నారు సెల‌బ్రెటీలు. మ‌రి ఇక ఆ షోల‌ను అడ్డం పెట్టుకుని ఈ యాంక‌ర్లు చేసే ఓవ‌ర్ యాక్ష‌న్ ఉంది చూశారు. అబ్బ‌అబ్బ‌అబ్బ‌అబ్బ జ‌నాలు చూడ‌లేక చ‌స్తున్నారు. కొన్ని ఇక ఈ షోల‌లో వీళ్ళు ప్ర‌ద‌ర్శించే రొమాంటిక్ సీన్స్ సాంగ్స్ హీరో హీరోయిన్ల‌ను మించిపోతున్నాయి అనే చెప్పాలి. మ‌రి ఈ ఆన‌వాయితి ఇప్ప‌టిది కాదు ర‌వి లాస్య‌ల షోనుంచి మ‌నంద‌రం చూస్తున్న‌దే. అప్ప‌ట్లో వారిద్ద‌రూ క‌లిసి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇక మ‌రి వీరి వ‌చ్చే రూమ‌ర్స్ కూడా మాములుగా ఉండ‌వ‌నే చెప్పాలి.

 

సోష‌ల్ మీడియా అంతా వీరిపైనే హంగామా. నార్మ‌ల్ పీపుల్ అంద‌రూ కూడా వీరి మీద పెట్టే కాన్‌స‌న్‌ట్రేష‌న్ మాములుది కాదు. షో మొత్తం ఒక ఎత్త‌యితే షో మొద‌ల‌య్యే ముందు ఈ యాంక‌ర్లు చేసే డాన్స్ మ‌రో ఎత్త‌ని చెప్పాలి. ఇక లాస్య ర‌వీల నుంచి సుధీర్ ర‌ష్మీల వ‌ర‌కు ఈ ల‌వ్ రూమ‌ర్స్ సాగుతూనే ఉన్నాయి. ఇక ఈ వార్త‌లు రావ‌డానికి వాళ్ళు చేసే హ‌డావిడి అనుమానాలు కూడా రాక మాన‌దు. అయితే వీళ్ళు ఇలా చేయ‌డానికి అస‌లు కార‌ణం ఏమిటంటే... ఫైన‌ల్‌గా వీళ్ళ షో టిఆర్‌పి రేటింగ్స్ ప‌డిపోకుండా అంద‌రి కంటే ముందుకు తీసుకుపోవ‌డం అనేది వీళ్ళ ఫైన‌ల్ టార్గెట్‌. హైపర్ ఆది - వర్షిని కాంబినేషన్ బుల్లితెర పై మంచి క్రేజ్ అందుకుంటోంది. డీ ఛాంపియనన్స్ లో ఈ జోడి చేస్తున్న హంగామా అంత‌లా ఉంటోంది. ఇక ఆది పంచ్‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న వేసే రొమాంటిక్ పంచ్‌ల‌కి వ‌ర్షిణి ఇచ్చే రొమాంటిక్ లుక్స్ అంద‌రినీ కైపెక్కించేలా ఉన్నాయి. 

 

ఇక సుధీర్ ర‌ష్మీల‌కి స్ట్రాంగ్‌గా పోటీ ఇవ్వాలంటే వీళ్ళు ఇంత‌లా రెచ్చిపోవ‌డం త‌ప్ప‌దంటున్నారు. ఇక వీళ్ళ మ‌ధ్య జ‌రిగే కొంటె స‌న్నివేశాలు మాత్రం ప్రేక్ష‌కులు మ‌రోలా అర్ధం చేసుకుంటున్నారు. ఇక ఇలాంటివ‌న్నీ బ‌య‌ట‌కు రాకుండా హైప‌ర్ ఆది ముందుగానే జ‌నాల‌కి క్లూ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: