ప్రస్తుతం కరోనా వైరస్ మెల్లగా అన్ని దేశాలను చుట్టుముడుతూ ఇప్పటికే దాదాపుగా 165 దేశాలకు విస్తరించింది. అయితే ఇతర దేశాలతో పోలిస్తే ఈ మహమ్మారి వ్యాధి తీవ్రత మన దేశంలో ఒకింత తక్కువగా ఉన్నప్పటికీ, ఇటీవల కొన్నాళ్ల నుండి పలు ఇతర దేశాల నుండి ఇక్కడకు వచ్చిన వారికి కరోనా వ్యాపించి ఉండవచ్చు అనే అనుమానంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ప్రయాణీకులను తమ దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీలైనంత త్వరగా వైద్య పరీక్షలు చేసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. అంతేకాక కరోనా మరింతగా ముదరకుండా మన దేశంలోని సినిమా హాళ్లు, పలు ఆలయాలు, షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద కంపెనీలు, దర్శనీయ ప్రదేశాల వంటి జనసమ్మర్థ ప్రాంతాలను పూర్తిగా మూసి వేయడం జరిగింది. ఇక అవకాశం ఉన్నంతవరకు ప్రజలను ఒక రెండు వారాల పాటు ఇళ్ల లోనే ఉండాలని, వీలైనన్ని ఎక్కువసార్లు ఎప్పటికప్పుడు తమ చేతలను సబ్బుతో లేదా శానిటైజర్లతో శుభ్రం చేసుకోవాలని కొద్దిరోజులుగా పలువురు డాక్టర్లతో పాటు ప్రముఖులు సైతం సూచనలు ఇస్తున్నారు. 

 

అలానే ప్రస్తుతం విదేశాల నుండి వస్తున్న పలు విమాన రాకపోకలను కూడా చాలావరకు ఆపేసిన భారత్, బయటి దేశాల నుండి వస్తున్న వారిని ఆయా విమానాశ్రయాల్లోనే పూర్తిగా స్కానింగ్ చేసి తనిఖీలు చేస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, ఇటీవల మార్చి 15వ తేదీన లండన్ నుండి ఇండియాకు తిరిగి వచ్చిన ప్రముఖ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కు నేడు కరోనా పాజిటివ్ అని తేలినట్లు లక్నో డాక్టర్లు ఒక అధికారిక ప్రకటనను కాసేపటి క్రితం రిలీజ్ చేసారు.  

 

15న లండన్ లో ఒక కార్యక్రమం పూర్తి చేసుకుని వచ్చిన కనికా, కరోనా మహమ్మారి దృష్ట్యా ప్రభుత్వం చేసిన సూచనలను పూర్తిగా తుంగలో తొక్కి, అదే రోజున దాదాపుగా 100 మందికి గ్రాండ్ గా పార్టీ ఇచ్చారని, అయితే లండన్ నుండి వచ్చిన తరువాత ఆమె వైద్య పరీక్షలు చేయించుకోలేదని, నేడు అధికారులు ఇటీవల విదేశాల నుండి వచ్చిన వారిలో ఆమె పేరు కూడా ఉందని తెలియడంతో, ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేల్చారు. అయితే ఆమె చేసిన ఈ పని సరైనది కాదని, కావున ఇకనైనా విదేశాల నుండి వచ్చిన వారు వైద్య పరీక్షలు చేయించుకుంటే మంచిదని పలువురు ప్రభుత్వ అధికారులు కోరుతున్నారు. కనికాకు కరోనా పాజిటివ్ అని తేలడంతో, ఒక్కసారిగా షాక్ అయిన ఆమె ఫ్యాన్స్, త్వరగా వ్యాధి నుండి కోలుకోవాలని ఆమెకు పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మెసేజెస్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: