కరోనా భయంతో ప్రజలు ఏం చేయాలన్నా భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా ఈ వైరస్‌ జంతువుల కారణంగా కూడా సోకుతుందన్న వార్తలు రావటంతో పెంపుడు జంతువుల విషయంలో కూడా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ప్రకటన చేసింది. ఈ వైరస్ జంతువుల ద్వారా సంక్రమించదని క్లారిటీ ఇచ్చింది. దీంతో పలువురు సెలబ్రిటీలు జంతువుల కోసం తమ గళ వినిపిస్తున్నారు.

 

బాలీవుడ్‌, నటి దర్శకురాలు పూజా భట్  కరోనా సంక్రమణకు జంతువులు కారణం అంటూ వస్తున్న వార్తలపై మండిపడ్డారు. ఈ వార్తలతో చాలా మంది జంతువుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ విడుదల చేసిన ఓ సర్క్యులర్‌ ను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్ట్ చేసిన పూజా, జంతువుల పట్ల అమానుషంగా పవర్తిస్తే అది శిక్షార్హమైన నేరం అని తెలిపింది.

 

బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా దర్శకురాలిగా, నిర్మాతగా, మోడల్‌ గా ఇలా వివిధ రంగాల్లో సత్తా చాటిన పూజా భట్‌ 2001 వరకు నటిగా కొనసాగింది. ఆ తరువాత 2006లో హాలీడే సినిమాతో దర్శకురాలిగా మారిన ఆమె నాలుగు చిత్రాలను రూపొందించింది. తాజాగా 20 ఏళ్ల తరువాత తన తండ్రి తెరకెక్కిస్తున్న సడక్‌ 2 సినిమాతో సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఇస్తోంది పూజా.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Animals DO NOT spread #covid_19 Please refer to this circular issued by the Animal Welfare Board of india and please do spread the word. Due to various misconceptions and false information floating around,people are abandoning animals,harming them and getting rid of them in very cruel and unethical ways. We need to be informed not ignorant. Let’s not make any more animals pay the price for our lack of knowledge please. 🙏❤️ 🐶 🐱 🐮 🐐 🐔 🐃 🐑 🐷 #animalsdonotspreadthecovid_19 #staysafe #educateyourselfandothers #learntocoexist @petaindia

A post shared by pooja B (@poojab1972) on

మరింత సమాచారం తెలుసుకోండి: