జబర్దస్త్ లో బాగా పాపులర్ అయినా ఆది తన టాలెంట్ తో మిగతా షోలలో కూడా ఛాన్సులు కొట్టేస్తున్నాడు. జబర్డస్త్ లానే ఈటీవీలో బాగా క్లిక్ అయిన మరో షో ఢీ. డ్యాన్స్ షోలో ఢీ నంబర్ 1 అని చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 11 సీజన్లుగా కొనసాగుతున్న ఈ షోకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్ లో కొద్దిగా ఫేమస్ అవగానే సుధీర్ ను అక్కడకు తీసుకొచ్చారు. ఢీ షో అనగానే అక్కడ డ్యాన్సర్లు వేసే డ్యాన్స్ కన్నా సుధీర్ రష్మిలు చేసే కామెడీనే బాగా వర్క్ అవుట్ అవుతుంది. 

 

దాదాపు రెండు సీజన్లుగా వారి జోడీ అక్కడ జబర్దస్త్ లో ఇక్కడ ఢీ షోలో చేస్తూ వచ్చారు. అయితే ఈ యూట్యూబ్ జోడీని చూసి బోర్ కొట్టిందని షో నిర్వాహకులే భావించారు అనుకుంటా అందుకే ఢీ షోలో మరోకొత్త జంట ఏర్పాటు చేశారు. అదే హైపర్ ఆది, వర్షిణి. ఆది వేసే పంచులు వర్షిణి ఫిదా అవడమే కాదు ఏకంగా అతని బుట్టలో పెద్దది. ఓ పక్క సుధీర్, రష్మీ మరో పక్క ఆది, వర్షిణి ఢీ షో ఈ జోడీలతో హడావిడి చేస్తుంది. 

 

అయితే ఆది కూడా వర్షిణితో ఈమధ్య చాలా క్లోజ్ గా ఉంటున్నట్టుగా కనిపిస్తుంది. సుధీర్ రష్మిలు కూడా ముందు షో కోసమే అన్నట్టు లవ్ బర్డ్స్ లా కనిపించినా ఇప్పుడు వాళ్ళు కాదన్న ఆడియెన్స్ మాత్రం వాళ్ళు జంటనే కోరుకుంటారు. ఇక లేటెస్ట్ గా ఆది, వర్షిణిల జంట కూడా అలాంటిదే. ఇదే విషయమై ఆదిని అడిగితే సుధీర్ రష్మిక క్రేజ్ ముందు నిలబడాలి అంటే వర్షిణితో ఆమాత్రం క్లోజ్ గా మూవ్ అవ్వాల్సిందే అంతేతప్పా మా మధ్య చెప్పుకోడానికి ఏమి లేదు అంటున్నాడు ఆది. వర్షిణి కూడా ఒకప్పుడు హీరోయిన్ గా ట్రై చేసి ఇప్పుడు బుల్లితెర మీద బాగానే సెటిల్ అయినట్టు అనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: