రాజమౌళి సినిమా అంటే ఎంత క్రేజ్ ఉంటుందో తెలియంది కాదు. తీసే ఒక్కో సినిమాను కళాఖండంలా తీర్చిదిద్దడమే ఆయన స్పెషాలిటీ. అందుకే ఇండస్ట్రీలో రాజమౌళిని జక్కన్న అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో చేస్తున్న భారీ మల్టీస్టారర్ పైనే ఇండియన్ సినిమా దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే పూర్తి కావాల్సిన ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు. ఈ ఏడాది విడుదల కావాల్సిన సినిమా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయింది. ఈ సినిమా తర్వాత రాజమౌళి చేయబోయే సినిమాపై పలు వార్తలు వస్తున్నాయి.

 

 

ఫలానా హీరోతో రాజమౌళి తర్వాతి ప్రాజెక్టు ఉంటుందని అనేక వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్లో రౌండ్ అవుతోంది. బాహుబలి సిరీస్ సినిమాల్లో భళ్లాళదేవుడిగా తన నటనతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న దగ్గుబాటి రానాతో తన తర్వాతి సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. ఆ సినిమాలో రానాను అత్యంత పవర్ ఫుల్ గా చూపించిన రాజమౌళి ఈసారి హీరోగా చూపించబోతున్నాడని అంటున్నారు. ఇందుకు తగ్గ కథా ప్రయత్నాలు మొదలయ్యాయని అంటున్నారు. ఈ వార్తపై అఫిషియల్ కన్ఫర్మేషన్ లేదు కానీ ప్రస్తుతం ఈ వార్తపై హాట్ టాపిక్ జరుగుతోంది.

 

 

కథను మాత్రమే బేస్ చేసుకుని హీరోను సెట్ చేసుకునే రాజమౌళి తాను అనుకున్న కాన్సెప్ట్ కు రానా దగ్గుబాటి కరెక్ట్ అని భావిస్తున్నాడని అంటున్నారు. రాజమౌళి అనుకున్న ఔట్ పుట్ ని రానా ఫర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేశాడు బాహుబలిలో. దీంతో వీరిద్దరి మధ్య మంచి రాపో పెరిగింది. మరి ఈ ప్రాజెక్టు గురించి ఎటువంటి డిటైల్స్ రావాలన్నా మరికొన్నాళ్లు ఆగాల్సిందే. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆర్ఆర్ఆర్ ఎప్పటికి పూర్తవుతుందో కూడా తెలియాల్సి ఉంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: