తెలుగు ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ నటించిన జెమిని చిత్రంలో మెరుపులా మెరిసింది అందమైన భామ నమిత.  ఆ తర్వాత ఆర్యన్ రాజేష్ నటించిన ‘సొంతం’ చిత్రంలో నటించింది.  ఈ రెండు చిత్రాల్లో నమిత సన్నగా వయ్యారంగా ఉండేది.  ఆ తర్వాత బొద్దుగా తయారు కావడంతో తెలుగు లో ఛాన్సులు రాలేదు.  బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించిన ‘సింహా’ చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ లో నటించింది.  ఇక బొద్దుగా ఉండే ముద్దుగుమ్మలను తెగ ఇష్టపడే తమిళ ప్రేక్షకులు ఈ అమ్మడిని బాగానే ఆదరించారు.  తమిళ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నమితకు వరుస ఛాన్సులు వచ్చాయి. 

 

ఒకదశలో నమిత అంటే పిచ్చేక్కే ఫ్యాన్స్ తయారయ్యారు.  నటిగా కొనసాగుతూనే బుల్లితెరపై మెరిసింది.  ఆ మద్య తమిళ్ లో వచ్చిన బిగ్ బాస్ లో నమిత పాల్గొని ఎన్నో కాంట్రవర్సీలు సృష్టించింది. ఆ మద్య తనను ఎంతగానో ఇష్టపడే తన బాయ్‌ఫ్రెండ్‌ వీరేంద్ర చౌదరి వివాహం చేసుకుంది.  తాజాగా నమిత ఇప్పుుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని చూస్తుంది.  గతంలో ఎంతో మంది సీనియర్ నటీమణులు పెళ్లిళ్లు చేసుకొని కొన్నాళ్ల తరువాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాణిస్తున్నారు. నమిత కూడా అదే తరహాలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని భావిస్తుంది. 

 

ఈ నేపథ్యంలో నమిత కూడా ఓ మంచి కథ దొరిగితే  రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అంటుంది. అంతే కాదే తన పాత్రలో వైవిద్యం ఉండేలా చూస్తానని.. రొటీన్ కి భిన్నంగా ఉండే పాత్రలో నటిస్తానని అంటుంది.  వచ్చిన కొత్తల్లో నమిత సన్నగా ఉండేది. ఆ తరువాత ఆమె కొంచెంబొద్దుగా మారింది. పెళ్లి తరువాత కూడా అదే రూపం కొనసాగిస్తోంది.  గత కొంత కాలంగా తాను సన్నబడటానికి వర్క్ఔట్ చేస్తున్నానని... త్వరలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నానని అంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: