పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటే వచ్చే కిక్కే వేరప్పా. ఆ స్థాయిలో పవన్ కల్యాణ్ సినిమాపై అంచనాలు ఉంటాయి. ప్రస్తుతం ఆయన వకీల్ సాబ్, క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. వకీల్ సాబ్ ను దిల్ రాజు నిర్మిస్తూండగా.. క్రిష్ తో సినిమాను ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాల విషయంలో వకీల్ సాబ్ కు పవన్ గడ్డం అవసరం. క్రిష్ సినిమాకు అవసరం లేదు. ఇప్పుడీ అంశమే ఓ ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తోంది.

 

 

రాజకీయాల్లో పవన్ ఎక్కువగా గడ్డంతోనే ఉండటంతో సినిమాకు కూడా అదే మేకోవర్ కావాలని చెప్పారట నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్. మొత్తం సినిమా అదే లుక్  కంటిన్యూ చేయమన్నారట. కానీ క్రిష్ తో సినిమా కోసం గడ్డం తీసేశాడు పవన్. ఇక్కడ వకీల్ సాబ్ సినిమా ఇంకా పూర్తి కాలేదు. కానీ పవన్ గడ్డం తీసేశాడు. మరి వకీల్ సాబ్ కు ఇంకా గడ్డంతో షూటింగ్ ఉందా లేదా.. గడ్డం లేకుండా ఉండే సీన్లే ఉన్నాయా.. దిల్ రాజుకు, వేణుకు చెప్పే గడ్డం తీసేశాడా అనేది తెలియలేదు. పవన్ వరుసగా సినిమాలు చేస్తాడని ఎవరూ ఊహించలేదు.

 

 

కానీ పవన్ వరుసగా సినిమాలకు సైన్ చేశాడు. క్రిష్ దర్శకత్వంలో ఓసినిమాను మొదలు పెట్టేశాడు. ఇదిగాక గబ్బర్ సింగ్ దర్శకుడు హరీశ్ శంకర్ తో ఓ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. పవన్ తో సినిమా తీయాలనేది దిల్ రాజు లైఫ్ టైమ్ డ్రీమ్. ఈ విషయం ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పాడు కూడా. మొత్తానికి పవన్ తో సినిమా మొదలుపెట్టాడు. మరి పవన్ గడ్డం విషయం వకీల్ సాబ్ కు ఇబ్బంది ఉందో లేదో దిల్ రాజే చెప్పాలి.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: