కరోనా వైరస్ వల్ల ప్రపంచం అతలాకుతలమవుతోంది. భూమి మీద ఉన్న అన్ని ఖండాలలో ఈ వైరస్ వ్యాపించి ఉంది. చైనా దేశంలో పుట్టిన ఈ వేరే ఇటలీ దేశంలో పడగ విప్పినటు చాలా మందిని బలి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇటలీ దేశ ప్రజలు ప్రభుత్వం ఆదేశించి ఆదేశాలను, సూచనలను, హెచ్చరికలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడంతో కరోనా వైరస్ వారికి సోకినట్లు అందుకే అంతగా ఆ దేశంలో వైరస్ ఉన్నట్లు స్వయంగా ఆ దేశ ప్రజలు సోషల్ మీడియాలో తమ బాధ చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా ఎవరు కూడా పైకి రాకూడదు మీ దేశ అధికారులు చెప్పే సూచనలను పరిగణలోకి తీసుకుని ఇంట్లోనే ఉంటూ వ్యక్తిగత శుభ్రం పాటించండి అంటూ మెసేజ్ లు చేస్తున్నారు.

 

తాజాగా ప్రధాని మోడీ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఇంట్లోనే ఉండాలని మార్చి 22 నుండి వారం పాటు ఇంటిలోనే ఉండి వర్క్ ఎట్ హోం చేయాలని ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా ఎవరు బయటికి రాకూడదని షాపింగ్ మాల్స్ మరియు  జిమ్ లు.. ఫిట్ నెస్ సెంటర్లతో పాటు యోగా సెంటర్లను వేయాలని సూచించడం జరిగింది. బహిరంగ సభలో మరియు మసీదులు, చర్చిలు, ఆలయాలు మొత్తమంతా కూడా మూతపడి పోవాలని ప్రభుత్వాలు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

 

ఇటువంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ ఓవరాక్షన్ తట్టుకోలేకపోతున్నాను అన్నట్టుగా ఇంటిలోనే ఫిట్ నెస్ కోసం కుస్తీలు పడుతున్న చిత్ర విచిత్రాల్ని ఫోటోలు వీడియోల రూపంలో పంచుకుంటున్నారు. వీటిని చూస్తున్న నెటిజన్లు కాస్త ఓవరాక్షన్ తగ్గించండి అంటూ సెటైర్లు వేస్తున్నారు. కత్రినా కైఫ్ మరియు కరీనా అదేవిధంగా బాలీవుడ్లో చిన్నచిన్న నటులంతా ఫిట్ నెస్ వీడియోలు పోస్ట్ చేస్తూ తెగ హడావిడి చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: