ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా వైరస్ గురించి మాటలే.. భయాలే.  చైనా నుంచి వచ్చిన ఈ కరోనా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 177 దేశాలకు విస్తరించింది. ఈ వ్యాధి బారిన 2,20,313 మంది పడగా, ఇప్పటివరకూ నమోదైన మృతుల సంఖ్య 9,800 దాటిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది.  ప్రస్తుతం భారత్ లో కూడా విస్తరిస్తుంది.  ఇటలీలో మృతుల సంఖ్యా 3,405 కు చేరింది, స్పెయిన్ లో 165, ఇరాన్ లో 149 మంది మృతి చెందారని ఇటలీలో మొత్తం మృతుల సంఖ్య చైనాను దాటి 3,500కు చేరువైందని వెల్లడించారు. శుక్రవారం కూడా చైనాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదన్నారు. ప్రపంచం మొత్తం మీద ఇటలీపైనే ఎక్కువ ప్రభావం కనిపిస్తున్నది.  యూరప్ దేశాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నది.  రోజు రోజుకు ప్రభావం పెరిగిపోతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.  

 

భారత్ లో సినిమా హాల్స్, మాల్స్, విద్యాసంస్థలు, క్లబ్ లు అన్ని మూసివేశారు.  కరోనా వైరస్ దేశం అంతటా విస్తరిస్తున్న నేపధ్యంలో రాబోయే కొద్ది రోజులు మనకు ఎంతో కీలంకంగా మారనున్నాయి. ఒక 2 – 3 వారాలు మనకు మనమే.. సామాజికంగా జరిగే అన్ని రకాల కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, సంయమనంతో వ్యవహరించవలసి ఉన్నది. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కూడా కరోనా వైరస్ సందర్భంగా ఇంట్లో ఉండవలసిన పరిస్థితుల్లో ప్రజలకు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారు.

 

“టింకిల్”, “అమరచిత్రకథ” యాప్ లను ఒక నెలపాటు ఉచితంగా అందిస్తున్నామనీ, ప్రజలు.. ముఖ్యంగా పిల్లలు బయట ఎక్కువగా తిరగకుండా.. ఇంటిపట్టున ఉండి ఈ అప్లికేషన్ ల ద్వారా వినోదం, విజ్ఞానం పొందండి.! అని అంటున్నారు రానా దగ్గుబాటి. ఇదిలా ఉంటే  ఇతర నటీ, నటులు కరోనాపై జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి.. అన్న విషయంపై అవగాహన ఏర్పాట్లు చేస్తున్నారు.  వీడియో షూట్స్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రానా లాంటి హీరోలు ప్రస్తుత పరిస్థితుల్లో, ఇంకా యాక్టివ్ గా ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: